టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్న వెటరన్ బ్యాటర్ పృథ్వీ షా విధ్వంసకర ద్విశతకంతో చెలరేగాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2025లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ మాజీ ముంబై బ్యాటర్.. చండీఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 141 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు.
రంజీ ట్రోఫీ చరిత్రలోనే ఇది రెండో వేగవంతమైన ద్విశతకం. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డ్ రవిశాస్త్రి పేరిట ఉంది. 1984-85 సీజన్‌లో రవి శాస్త్రి 123 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు. తాజాగా పృథ్వీ షా 141 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించి రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో రాహుల్ సింగ్(143 బంతుల్లో) రికార్డ్‌ను పృథ్వీ షా బద్దలు కొట్టాడు.
72 మ్యాచ్‌ల్లో సెంచరీ పూర్తి చేసుకున్న పృథ్వీ షా.. మరో 71 బంతుల్లో డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. రంజీలో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ రిషభ్ పంత్(48 బంతుల్లో) పేరిట ఉండగా.. రాజేశ్ బోరా(56), రియాన్ పరాగ్(56), రూబెన్ పాల్(60), రజత్ పటిదార్(68) పృథ్వీ షా కన్నా ముందున్నారు. రంజీల్లో మహారాష్ట్ర తరఫున ఇదే వేగవంతమైన సెంచరీ కావడం గమనార్హం. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పృథ్వీ షాకు ఇది 14వ శతకం.

ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపర్చిన పృథ్వీ షా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దుమ్మురేపుతున్నాడు. తనదైన బ్యాటింగ్‌తో డబుల్ సెంచరీ దిశగా కొనసాగుతున్నాడు. పృథ్వీ షా విధ్వంసకర బ్యాటింగ్‌తొ మహారాష్ట్ర భారీ స్కోర్ దిశగా సాగుతోంది. రంజీ ట్రోఫీలో మహారాష్ట్ర తరఫున అరంగేట్ర ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన పృథ్వీ షా.. రెండో ఇన్నింగ్స్‌లో 75 పరుగులతో రాణించాడు.
ఈ సీజన్ ప్రారంభానికి ముందే ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన పృథ్వీ షా.. ముంబైతోనే జరిగిన వామప్ మ్యాచ్‌లో 181 పరుగులు చేశాడు. బుచ్చి బాబు టోర్నీలో తొలి మ్యాచ్‌లోనే 111 పరుగులు చేసాడు. తాజాగా మరో భారీ శతకంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సీజన్‌లో అతను ఇదే జోరు కొనసాగిస్తే.. అతి త్వరలోనే టీమిండియా తరఫున టెస్ట్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం లభిస్తోంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(116) సెంచరీతో రాణించగా.. సౌరభ్ నవలే(66) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అనంతరం చంఢీఘడ్ 209 పరుగులకే ఆలౌటైంది. నిషుంక్ బిర్లా(56), రమన్ బిష్ణోయ్(54)హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అనంతరం మహారాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌లో 41 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లకు 285 పరుగులు చేసింది. క్రీజులో పృథ్వీ షా(200 బ్యాటింగ్)తో పాటు రుతురాజ్ గైక్వాడ్(6 బ్యాటింగ్) ఉన్నాడు.