For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పృథ్వీ షా విధ్వంసం.. హైదరాబాద్‌కు ఘోర పరాజయం!

ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు టీమిండియా సీనియర్ బ్యాటర్ పృథ్వీ షా విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వీ షా.. కోల్‌కతా వేదికగా శుక్రవారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు.

ఈ మ్యాచ్‌లో మొత్తం 36 బంతులు ఆడిన పృథ్వీ 3 సిక్స్‌లు, 9 ఫోర్లతో 66 పరుగులు చేశాడు. అర్సిన్ కులకర్ణితో కలిసి తొలి వికెట్‌కు 73 బంతుల్లో 117 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. పృథ్వీ షా విధ్వంసకర బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 191 పరుగులు చేసింది. చామ మిలింద్(20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 35 నాటౌట్), తనయ్ త్యాగరాజన్(17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32), రాహుల్ బుద్ది(25 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లతో 31) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

Prithvi Shaw Smashes 23-Ball Fifty Extends Red-Hot Form Ahead of IPL Auction

అనంతరం మహారాష్ట్ర జట్టు 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసి గెలుపొందింది. పృథ్వీ షాతో పాటు అర్షిన్ కులకర్ణి(54 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 89 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు.

పృథ్వీ క్రీజులోకి వచ్చినప్పటినుంచే దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. అతను 47 శాతం ఆఫ్ సైడ్, 53 శాతం లెగ్‌సైడ్ పరుగులు రాబట్టాడు. అతను ఇదే జోరును కొనసాగిస్తే.. ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఏదో జట్టులో ఆడే అవకాశం అందుకుంటాడు. ఇక అవకాశాలు సన్నగిల్లడంతో పృథ్వీ షా ముంబై జట్టు నుంచి మహారాష్ట్రకు మారిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2025 మెగా వేలంలో పృథ్వీ షా అన్‌సోల్డ్‌గా నిలిచాడు.

Story first published: Friday, November 28, 2025, 14:01 [IST]
Other articles published on Nov 28, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+