Vijay Hazare Trophy 2021: పృథ్వీ షా డబుల్ సెంచరీ.. సరికొత్త రికార్డు

జైపూర్: దేశవాళీ ప్రతిష్టాత్మక వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో టీమిండియా యువ ఓపెనర్, ముంబై సెన్సేషన్ పృథ్వీ షా జోరు కొనసాగుతుంది. ఆస్ట్రేలియా పర్యటనలో దారుణంగా విఫలమై భారత జట్టులో చోటు కోల్పోయిన పృథ్వీ షా.. ఈ దేశవాళీ టోర్నీతో లయ అందుకున్నాడు. ఇటీవల ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి టచ్‌లోకి వచ్చిన షా.. తాజాగా పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. 152 బంతుల్లో 31 ఫోర్లు, 5 సిక్సర్లతో 227 పరుగులతో అజేయంగా నిలిచిన షా నయా రికార్డు నెలకొల్పాడు.

తొలి కెప్టెన్‌గా..
విధ్వసంకర ఇన్నింగ్స్‌తో ఈ ముంబైకర్ సంజూ శాంసన్(212) పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును అధిగమించాడు. అంతేగాక లిస్టు ఏ క్రికెట్(పురుషుల)లో ఈ ఫీట్ సాధించిన తొలి కెప్టెన్‌గా కూడా నిలిచాడు. కాగా శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో పృథ్వీ షా ముంబై జట్టు పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో ఇంతకు ముందు సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, కేవీ కౌశల్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ ద్విశతకం సాధించారు.

సూర్యకుమార్ యాదవ్ సెంచరీ..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై.. పృథ్వీ షా డబుల్ సెంచరీకి అండగా సూర్యకుమార్ యాదవ్(58 బంతుల్లో 22 ఫోర్లు, 4 సిక్స్‌లతో 133) శతకం సాధించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 457 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(10) విఫలమైనా.. ఆదిత్య తారే(56) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక ముంబై చేసిన 457/4 పరుగులు.. లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక స్కోర్. అంతకుముందు మధ్యప్రదేశ్‌పై జార్ఖండ్ 422/9 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశం దక్కిన విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్నా.. అతనికి అవకాశాలు దక్కలేదు.
భారీ విజయం..
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పుదుచ్చేరి 38.1 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటై 233 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ముంబై బౌలర్ ప్రశాంత్ సోలంకీ(5/48) పుదుచ్చేరి పతనాన్ని శాసించాడు. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో కెప్టెన్ దామోదరన్ రోహిత్(63)మినహా అంతా విఫలమయ్యారు. టీమిండియా స్టార్ పేసర్ శార్దూల్ ఠాకూర్ తుషార్ పాండే రెండేసి వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications