టీమిండియా వెటరన్ ఓపెనర్ పృథ్వీ షా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అప్‌కమింగ్ దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ కోసం ఎంపిక చేసిన ముంబై జట్టులో పృథ్వీ షాకు చోటు దక్కలేదు. ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో ముంబై జట్టులోకి ఇచ్చి పృథ్వీ షా.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయినా.. మెరుపు ఆరంభాలు అందించాడు.
ఈ క్రమంలోనే విజయ్ హజారే ట్రోఫీకి ఎంపికవుతానని భావించాడు. కానీ ముంబై సెలెక్టర్లు మాత్రం పృథ్వీ షాకు షాకిచ్చారు. దాంతో పృథ్వీ షా సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరితమైన పోస్ట్‌ను పంచుకున్నాడు. తన లిస్ట్-ఏ రికార్డ్స్‌ను షేర్ చేస్తూ.. ఇంకా నేనేం చేయాలి? అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

'దేవుడా చెప్పు.. నేను ఇంకేం చేయాలి. 65 ఇన్నింగ్స్‌లు.. 3399 పరుగులు.. 55.7 సగటు.. స్ట్రైక్‌రేట్ 126 నమోదు చేసినా.. నా ఎంపికకుఇవి సరిపోలేదు. అయినా నీ(దేవుడి)పై నా నమ్మకం సడలదు. ప్రజలు కూడా నన్ను విశ్వసిస్తారని ఆశిస్తున్నా. ఎందుకంటే నేను ఖచ్చితంగా పునరాగమనం చేస్తాను. ఓం సాయిరామ్' అని ఇన్‌స్టా స్టోరీలో పృథ్వీ షా పేర్కొన్నాడు.
లిస్ట్-ఏ క్రికెట్‌లో పృథ్వీ షా 10 శతకాలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పృథ్వీ షా 9 మ్యాచ్‌ల్లో 21.88 సగటుతో 197 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ముంబై సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సాధించిన విషయం తెలిసిందే.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో పృథ్వీ షా అన్‌సోల్డ్‌గా నిలిచాడు. రూ. 75 లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చిన అతన్ని ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో కూడా చోటు దక్కకపోవడంతో పృథ్వీ షా కెరీర్ డేంజర్ జోన్‌లో పడింది. క్రమశిక్షణా రాహిత్యంతోనే పృథ్వీ షాపై ముంబై సెలెక్టర్లు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ హజారే ట్రోఫీలోనూ శ్రేయస్ అయ్యర్.. ముంబై జట్టును నడిపించనున్నాడు.
Instagram story of Prithvi Shaw.
— Johns. (@CricCrazyJohns) December 17, 2024
- Shaw has been dropped from the Mumbai squad for the Vijay Hazare Trophy after having such remarkable stats in List A 🙇 pic.twitter.com/mGoykOwuon
విజయ్ హజారే ట్రోఫీ కోసం ఎంపికైన ముంబై జట్టు:
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), ఆయుష్ మాత్రే, అంగ్‌క్రిష్ రఘువంశీ, జయ్ బిస్తా, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, సూర్యాన్ష్ షెగ్దే, సిద్దేష్ లాడ్, హార్దిక్ తోమర్, ప్రసాద్ పవార్