From emotions on #TeamIndia comeback & the support system to reuniting with former U-19 teammates and Head Coach Rahul Dravid 👍 👍
— BCCI (BCCI) January 27, 2023
𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦 as PrithviShaw discusses all this & more 👌 👌 - By ameyatilak
Full interview 🎥 🔽 #INDvNZhttps://t.co/ZPZWMbxlAC pic.twitter.com/IzVUd9tT6X
ఫోన్ హ్యాంగ్ అయ్యింది..
ఈ ట్రిపుల్ సెంచరీతో 18 నెలల తర్వాత టీమిండియాకు ఎంపికైన పృథ్వీ షా.. న్యూజిలాండ్‌తో తొలి టీ20 ముందు బీసీసీఐ టీవీతో మాట్లాడాడు. ఈ వీడియోను బీసీసీఐ శుక్రవారం అభిమానులతో పంచుకుంది. టీమిండియాకు ఎంపికైన క్షణాన తనకు అభినందనలు వెల్లువెత్తాయని, వరుస ఫోన్లు, మేసేజ్‌లతో తన మొబైల్ హ్యాంగ్ అయ్యిందని పృథ్వీ షా చెప్పాడు. 'చాలా రోజులుగా నేను భారత జట్టుకు దూరంగా ఉన్నాను. మళ్లీ పునరాగమనం చేయడం సంతోషంగా ఉంది. రాత్రి 10.30 సమయంలో జట్టును ప్రకటించారు. ఆ క్షణంలో నాకు చాలా ఫోన్లు, మెసేజ్‌లు వచ్చాయి. వాటి దెబ్బకు నా ఫోన్ హ్యాంగ్ అయ్యింది. దాంతో ఏం జరుగుతుందని కాస్త షాక్‌కు గురయ్యాను.

అందరూ అండగా నిలిచారు..
గత 18 నెలలుగా జట్టుకు దూరంగా ఉన్న నాకు ఈ సమయం చాలా కఠినంగా గడిచింది. కానీ నాకు మద్దుతు ఇచ్చే వారు మాత్రం అండగా నిలిచారు. భారత్ జట్టుకు రాక ముందు నుంచి అండగా నిలిచినవారు ఆ మద్దతును అలానే కొనసాగించారు. నేను ఆడకపోయినా.. వారు నాకు మద్దుతుగా ఉండటం సంతోషాన్నిచ్చింది. నా స్నేహితులు, కుటుంబం, తండ్రి, కోచ్‌లు చాలా సపోర్ట్‌గా నిలిచారు. అలాంటి వారు నా జీవితంలో ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.

మా నాన్న ఒక్కటే చెప్పాడు..
ఇక టీమ్ సెలెక్ట్ అయినందుకు నేను ఎలాంటి సంబరాలు చేసుకోలేదు. ఆ సమయంలో నేను అస్సాంలో ఉన్నాను. మా నాన్న మాత్రం చాలా సంతోషించాడు. జట్టులోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చావ్.. ఫోకస్ ఆట మీద పెట్టాలని హెచ్చరించాడు. అవకాశం వస్తే పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాలని సూచించాడు.'అని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు.

400 కొట్టాల్సింది..
రంజీట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ సాధించడంపై స్పందిస్తూ.. పృథ్వీ షా సంతోషం వ్యక్తం చేశాడు. 'ట్రిపుల్ సెంచరీతో రంజీల్లో రికార్డు నెలకొల్పడం సంతోషంగా ఉంది. నేను ఆటను మాత్రమే ఆడాను. ప్రత్యేకంగా ఏం చేయలేదు. నాపై పూర్తి నమ్మకంతో ఆడాను. సెంచరీ, డబుల్ సెంచరీ చేసినా కూడా పట్టుదలతో నా ఇన్నింగ్స్ కొనసాగించాను. అయితే 400 చేయకపోవడంపై ఇప్పటి కీ బాధపడుతున్నాను. మరో 21 పరుగులు చేస్తే ఆ ఘనత నాకు దక్కేది.


Click it and Unblock the Notifications












