Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సాయి బాబా.. పృథ్వీ షాకు ఎందుకు ఈ పరీక్ష!

లండన్: ఇంగ్లండ్ గడ్డపై సెంచరీల మోత మోగిస్తున్న టీమిండియా ఓపెనర్ పృథ్వీ షాకు మళ్లీ గడ్డు కాలం మొదలైంది. రాయల్ లండన్ వన్డే కప్‌ టోర్నీలో ఓ డబుల్ సెంచరీతో పాటు విధ్వంసకర సెంచరీ బాదీ సూపర్ ఫామ్ కనబర్చిన పృథ్వీ షా అనూహ్యంగా గాయపడి ఈ టోర్నీకి దూరమయ్యాడు. మోకాలి గాయంతో పృథ్వీ షా ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడని అతను ప్రాతినిథ్యం వహిస్తున్న నార్తంప్టన్‌షైర్ జట్టు ప్రకటించింది.

తమ అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. డర్హమ్‌ జట్టుతో జరిగిన గత మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా పృథ్వీ షా గాయపడ్డాడని, ఈ ఉదయమే అతని స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చాయని తెలిపింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను ఈ టోర్నీకి దూరమయ్యాడని పేర్కొంది.

Prithvi Shaw ruled out of the Royal London One-Day Cup due to knee injury

'పృథ్వీ షా రాయల్ వన్డే కప్ టోర్నీకి దూరమయ్యాడు. అతను దూరమవ్వడం మమ్మల్ని బాధిస్తోంది.'అని నార్తంప్టన్ షైర్ జట్టు ట్వీట్ చేసింది. ఇప్పటి వరకు జరిగిన రాయల్ వన్డే కప్ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన పృథ్వీ షా 429 పరుగులు చేశాడు. అతనే హయ్యెస్ట్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.

అయితే డర్హమ్ మ్యాచ్‌‌లో గాయంతోనే బ్యాటింగ్ చేసిన పృథ్వీ సెంచరీ చేయడం గమనార్హం. నార్తంప్టన్ షైర్ కోచ్ పృథ్వీ షాపై ప్రశంసల జల్లు కురిపించాడు. తమ జట్టు తరఫున ఆడింది కొన్ని మ్యాచ్‌లే అయినా చాలా ప్రభావం చూపాడని కొనియాడాడు. అతన్ని తాము చాలా మిస్సవుతామని చెప్పుకొచ్చాడు.

బీసీసీఐ పర్యవేక్షణలో లండన్‌లోని స్పెషలిస్ట్ వైద్యుడి వద్ద పృథ్వీ షా చికిత్స తీసుకోనున్నాడు. పేలవ బ్యాటింగ్‌తో పాటు అనవసర గొడవలతో ఫేడ్ ఔట్ అయిన పృథ్వీ షా.. ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. నార్తంప్టన్‌షైర్ క్లబ్ తరఫున రాయల్ వన్డే కప్‌లోకి అరంగేట్రం చేసిన పృథ్వీ షా తొలి రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు.

సోమర్‌సెట్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో పృథ్వీ షా విధ్వంసకర డబుల్ సెంచరీ నమోదు చేశాడు. 153 బంతుల్లో 244 పరుగులు చేశాడు. అతన్ని ఇన్నింగ్స్‌లో 28 ఫోర్లు, 11 సిక్స్‌లతో 39 బౌండరీలు ఉండటం విశేషం. డర్హమ్ జట్టుతో ఆదివారం జరిగిన నాలుగో మ్యాచ్‌లోనూ పృథ్వీ షా(76 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్స్‌లతో 119 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు.

వరుసగా విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో భారత అభిమానులతో పాటు సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన పృథ్వీ షా.. అంతలోనే గాయపడ్డాడు. దాంతో ఫ్యాన్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పృథ్వీ షా ఇష్టదైవం సాయిబాబను ప్రశ్నిస్తున్నారు. 'సాయి బాబా.. పృథ్వీ షాకు ఎందుకు ఈ పరీక్ష!'అని కామెంట్ చేస్తున్నారు.

Story first published: Wednesday, August 16, 2023, 15:59 [IST]
Other articles published on Aug 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+