
21 సందర్భాల్లో
టెస్టుల్లో మొత్తం 21 సందర్భాల్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్ని మ్యాచ్‌లు గెలిచాడు. అలాగే విదేశాల్లోనూ ఈ విధంగా మంచి రికార్డు కొనసాగిస్తున్నాడు. విదేశాల్లో 10సార్లు టాస్ గెలవగా.. 8 సార్లు భారత జట్టు విజయం సాధించింది. దీంతో టెస్టుల్లో కోహ్లీ టాస్ గెలిస్తే.. దాదాపు మ్యాచ్ గెలిచినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే టీమిండియాకు ఇది రెండో డై/నైట్ టెస్టు మాత్రమే. మరోవైపు ఆసీస్ మాత్రం ఇప్పటికే 7 డే/టెస్టు మ్యాచ్‌లు ఆడి అన్నింటా గెలిచింది. ఇదే కాస్త కోహ్లీసేనను కలవరపెడుతోంది.

ఈ మ్యాచ్‌లో గెలిస్తే
విరాట్ కోహ్లీ ప్రస్తుత సిరీస్‌లో ఓ అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఇప్పటికే గత పర్యటనలో రెండు టెస్టులు గెలుపొందిన కోహ్లీ.. మరో మ్యాచ్ గెలిస్తే ఆస్ట్రేలియాలో మూడు టెస్టులు గెలిచిన ఏకైక ఆసియా సారథిగా నిలుస్తాడు. ఇంతకుముందు భారత మాజీ సారథి బిషన్‌సింగ్ బేడీ 1977-78 సీజన్‌లో భారత్‌కు కంగారూ గడ్డపై రెండు విజయాలు అందించాడు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ముస్తాక్ మహ్మద్ 1977, 1979లో ఒక్కో టెస్టు గెలుపొందాడు. ఆ తర్వాత కోహ్లీసేన 2018-19 సీజన్‌లో రెండు టెస్టుల్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే కొత్త రికార్డు సృష్టిస్తాడు.

మరో సెంచరీ చేస్తే
విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కెప్టెన్‌గా 41 సెంచరీలు చేశాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా 41 సెంచరీలతో కోహ్లీతో కలిసి టాప్‌లో ఉన్నాడు. మరో సెంచరీ చేస్తే.. కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు చేసిన వరల్డ్ రికార్డును కోహ్లీ తన ఖాతాలో వేసుకుంటాడు. అయితే ఆస్ట్రేలియాలో ఈ రికార్డు అందుకోవడానికి కోహ్లీకి ఒక టెస్ట్ మాత్రమే అవకాశం ఉంది. తొలి టెస్ట్ తర్వాత కోహ్లీ ఇండియాకు తిరిగి వస్తున్న విషయం తెలిసిందే. దీంతో అడిలైడ్‌లో జరుగుతున్న డే/నైట్ టెస్ట్‌లోనే ఈ మైల్‌స్టోన్‌ను విరాట్ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

షా డకౌట్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్, భారత్ మధ్య ఆడిలైడ్‌లో జరుగుతున్న డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌లో పరుగుల కోసం భారత్ బ్యాట్స్‌మన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆసీస్ పేసర్లు స్టార్క్, కమ్మిన్స్, హాజెల్‌వుడ్ తమ పదునైన బంతులతో చెలరేగుతున్నారు. డిన్నర్ బ్రేక్ సమయానికి భారత్ 25 ఓవర్లలో 41/2 స్కోరు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, పూజారా ఉన్నారు. ఓపెనర్ పృథ్వీ షా (0) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మయాంక్ (17) నిరాశపరిచాడు.
రహానెది తెలివైన బుర్ర.. జట్టును అద్భుతంగా నడిపించగలడు: క్రికెట్ దిగ్గజం


Click it and Unblock the Notifications












