
హైదరాబాద్: తొలి ఐపీఎల్‌లోనే ఓపెనర్‌గా దిగిన పృథ్వీ షా సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్ 2018లో అరంగేట్రం చేసిన ఆటగాడు పృథ్వీ షా. అండర్-19 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు పృథ్వీ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. జనవరిలో నిర్వహించిన వేలంలో పృథ్వీని ఢిల్లీ డేర్‌డెవిల్స్ సొంతం చేసుకుంది.
సోమవారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో ఆడిన మ్యాచ్ పృథ్వీకి మొదటిది. అంతేగాక ఇందులో ఓపెనర్‌గా దిగి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. గౌతమ్ గంభీర్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగి అత్యంత పిన్న వయస్కుడు ఓపెనర్‌గా దిగిన రికార్డు సృష్టించాడు. పృథ్వీ షా వయసు 18 సంవత్సరాల 165 రోజులు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
అంతకుముందు రిషబ్ పంత్ (18 ఏళ్ల 212 రోజులు) ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫునే 2017లో ఐపీఎల్‌లో ఆడాడు. అలాగే ఇషాన్ కిషన్(18 ఏళ్ల 283 రోజులు) గత ఏడాది గుజరాత్ లయన్స్ తరఫున తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఆడిన మ్యాచ్‌లో పృథ్వీ షా 10 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ కేవలం 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఒక విజయం, ఐదు పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. మళ్లీ తన స్థానం మెరుగుపరుచుకోవాలంటే ఏప్రిల్ 27 శుక్రవారం కోల్‌కతా జట్టుతో పోటీపడాల్సిందే. అయితే ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుతో పోటీ పడనున్న కోల్‌కతా ఇంతకుముందు మ్యాచ్‌లో ఢిల్లీపై 71 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది.