Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మరో వివాదంలో పృథ్వీ షా.. సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడిని కొట్టబోయి..!

టీమిండియా వెటరన్ బ్యాటర్ పృథ్వీ షా మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఔట్ చేశాడనే అసహనంలో ప్రత్యర్థి ఆటగాడిని బ్యాట్‌తో కొట్టబోయాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటికే అనేక వివాదాలతో పాటు ఫిట్‌నెస్ సమస్యలతో టీమిండియాకు దూరమైన పృథ్వీ షా.. ఇప్పుడు మరో సమస్యను తెచ్చిపెట్టుకున్నాడు.

ప్రతిభకు లోటు లేకున్నా.. క్రమశిక్షణారాహిత్యంతో బంగారం లాంటి కెరీర్‌ను పృథ్వీ షా నాశనం చేసుకున్నాడు. 24 ఏళ్ల వయసులోనే పొట్ట, బట్ట తలతో అంకుల్‌లా మారి తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యాడు. తన సారథ్యంలో ఆడిన శుభ్‌మన్ గిల్ టీమిండియా కెప్టెన్‌గా ఎదిగితే పృథ్వీ షా మాత్రం దేశవాళీ క్రికెట్‌కే పరిమితమయ్యాడు. ఇటీవలే తన తప్పిదాలను అంగీకరించి కమ్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్దమైన పృథ్వీ షా.. రంజీ టీమ్ కూడా మారాడు. సుదీర్ఘకాలం ఆడిన ముంబై ఇండియన్స్‌కు వీడ్కోలు పలికి మహారాష్ట్ర తరఫున బరిలోకి దిగుతున్నాడు.

Prithvi Shaw Involved in Heated Fight With Musheer Khan Attempts To Hit Former Teammate With Bat
Photo Credit: X (twitter)

రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ ప్రారంభానికి ముందు ముంబై, మహారాష్ట్ర మధ్య మంగళవారం ప్రారంభమైన 3 రోజుల వామప్ మ్యాచ్‌లో పృథ్వీ షా భారీ శతకంతో చెలరేగాడు. 181 పరుగులతో డబుల్ సెంచరీ దిశగా సాగుతున్న పృథ్వీ షాను సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. పృథ్వీ షా వికెట్‌ను ముషీర్ ఖాన్ వైల్డ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నాడు. దాంతో ఆగ్రహానికి గురైన పృథ్వీ షా అతనిపైకి బ్యాట్ ఎత్తాడు. దాంతో అక్కడ చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకోగా అంపైర్లు జోక్యం చేసుకొని విడదీసారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. పృథ్వీ షాకు చివాట్లు పెడుతున్నారు. 'అసలే నీది బ్యాడ్ టైమ్.. అవసరమా ఇది'అని పృథ్వీ షాను మందలిస్తున్నారు.ఈ ఎక్స్‌ట్రాలు తగ్గించి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడంపై ఫోకస్ పెట్టాలని హితవు పలుకుతున్నారు.

Story first published: Wednesday, October 8, 2025, 10:57 [IST]
Other articles published on Oct 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+