
అహ్మదాబాద్: సొంతగడ్డపై టెస్టుల్లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌తో పాటు నంబర్ వన్ ర్యాంక్ అందుకొని ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా ఇప్పుడు టీ20 సిరీస్‌కు సిద్దమవుతోంది. టెస్ట్ సిరీస్ మాదిరిగానే.. టీ20 పట్టేయాలనే లక్ష్యంతో కోహ్లీసేన కసరత్తులు చేస్తున్నది. మార్చి 12 నుంచి అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 ఆరంభంకానున్న విషయం తెలిసిందే.
తొలి టీ20కి మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉండడంతో టీమిండియా జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్, మణికట్టు స్పిన్నర్ యుజువేంద్ర చహల్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ నెట్స్‌లో సాధన చేశారు. ముఖ్యంగా కోహ్లీ, ధావన్ నెట్స్‌లో చెమటోడ్చారు. దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైని వారికి బంతులు సంధించారు. అనంతరం అందరూ త్రోస్, క్యాచులు ప్రాక్టీస్ చేశారు. ట్రైనింగ్ సెషన్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేసింది.
టీ20 సిరీస్‌లో టీమిండియా ఫైనల్ ఎలెవన్ సెలెక్షన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఒక్కో ప్లేస్‌కు ఇద్దరేసి ప్లేయర్లు పోటీ పడుతున్నారు. ఇది టీమ్ మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. తొలుత సెటిల్ కాంబినేషన్‌తో వెళ్లి సిరీస్ నెగ్గిన తర్వాత ప్రయోగాలు చేస్తారా? లేదా దూరదృష్టితో ఆలోచించి మొత్తం యంగ్‌స్టర్స్‌ను దించి వారి సత్తాను పరీక్షిస్తారా? అన్నది చూడాలి. అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రాహుల్ తెవాతియాకు చోటెక్కడ ఇస్తారన్నది ఓ పెద్ద ప్రశ్న.
భారత టీ20 జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ , ఇషాన్ కిషన్, యుజ్వేందర్ చహల్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, టి నటరాజన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, నవదీప్ సైనీ, శార్ధూల్ ఠాకూర్.
ఇంగ్లండ్ టీ20 జట్టు:
ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, సామ్ కర్రన్, టామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, అదిల్ రషీద్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, మార్క్ వుడ్.