Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Prithvi Shaw: 23 ఏళ్లకే ఆ పొట్ట.. బట్ట ఏందిరా?

లండన్: టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా విధ్వంసకర డబుల్ సెంచరీతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. పేలవ ఫామ్‌తో భారత జట్టులో చోటు కోల్పోయిన పృథ్వీ షా.. చివరకు ద్వితీయ శ్రేణి జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. వెస్టిండీస్‌తో పాటు ఏషియన్ గేమ్స్‌కు తనను ఎంపిక చేయకపోవడాన్ని అవమానంగా భావించిన పృథ్వీషా.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు కసిగా ప్రయత్నిస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌లోని దేశవాళీ క్రికెట్ ఆడుతున్న పృథ్వీ షా.. డొమెస్టిక్ వన్డే కప్ 2023 టోర్నీలో విధ్వంసకర డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ టోర్నీలో నార్తాంప్టన్ షైర్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పృథ్వీ షా.. గత బుధవారం సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో 153 బంతుల్లో 244 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా 28 ఫోర్లు, 11 సిక్స్‌లతో మొత్తం 39 బౌండరీలు బాదాడు.

Prithvi Shaw

ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో తాను ఎంతటి ప్రమాదకర ఆటగాడిననే విషయాన్ని మరోసారి ప్రపంచానికి తెలియజేశాడు. ఈ విధ్వంసకర డబుల్ సెంచరీతో పలు రికార్డులను ఖాతాలో వేసుకొని నెటిజన్ల ప్రశంసలు కూడా అందుకున్నాడు. అయితే అంతే స్థాయిలో విమర్శలను కూడా ఎదుర్కొంటున్నాడు. డబుల్ సెంచరీ అనంతరం బ్యాట్ పైకెత్తుతూ అతను ఇచ్చిన ఫోజ్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

బట్టతల.. పొట్టతో బాగా లావుకెక్కిన పృథ్వీ షాపై నెటిజన్లు బాడీషేమింగ్ కామెంట్ చేస్తున్నారు. అసలు పృథ్వీ షా వయసు 23 ఏళ్లేనా? అని ప్రశ్నిస్తున్నారు. '23 ఏళ్లకే ఆ పొట్ట.. బట్ట ఏందిరా?' అని సెటైర్లు పేల్చుతున్నారు. తప్పుడు పత్రాలతో పృథ్వీ షా క్రికెట్ ఆడుతున్నాడని ఆరోపిస్తున్నారు. మరికొందరు 10 ఏళ్ల క్రితం ఫొటోనూ.. తాజా ఫొటోతో పోల్చుతూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఎంతో ప్రతిభ ఉన్న పృథ్వీ షా ఫేడ్ ఔట్ అవ్వడానికి ఈ ఫొటోనే నిదర్శనమని, ఫిట్‌నెస్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టకపోవడంతోనే అతను గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా పృథ్వీ షా ఫిట్‌నెస్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు.

ఇంకొందరు మాత్రం పృథ్వీ షాకు అండగా నిలుస్తున్నారు. అతని శరీరాన్ని చూడకుండా ఆటను చూడాలని కోరుతున్నారు. చిన్న వయసులో‌నే సక్సెస్‌తో పాటు వైఫల్యాలు రావడంతో పృథ్వీ షా మానసిక సమస్యలను ఎదుర్కొన్నాడని, దాంతోనే జుట్టు కోల్పోవడంతో పాటు బరువెక్కాడని అండగా నిలుస్తున్నారు. బాడీ షేమింగ్ కామెంట్స్ ఆపి అండగా నిలవాలని కోరుతున్నారు.

Story first published: Friday, August 11, 2023, 21:06 [IST]
Other articles published on Aug 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+