Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్లాష్ న్యూస్.. హీరోయిన్‌తో ప్రేమలో పడ్డ టీమిండియా ఓపెనర్!!

Prithvi Shaw dating with actress Prachi Singh
IPL 2020 : Delhi Capitals Batsman Prithvi Shaw Dating Actress Prachi Singh? || Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్లు, బాలీవుడ్‌ హీరోయిన్‌ల మధ్య ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెటర్లు, హీరోయిన్ల మధ్య ప్రేమయణం అంటే.. రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఈ రూమర్స్‌ను కొందరు నిజం చేసారు కూడా. విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, జహీర్‌ ఖాన్-సాగరిక, హర్భజన్‌ సింగ్-గీతా బస్రా, యువరాజ్ సింగ్-హజెల్‌ కీచ్, హార్దిక్ పాండ్యా-నటాషా‌ కొద్దికాలం ప్రేమలో ఉండి తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇక టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా కూడా ప్రేమలో పడినట్లు సమాచారం తెలుస్తోంది.

సంథింగ్ సంథింగ్

సంథింగ్ సంథింగ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్‌లో ఆడేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా యూఏఈకి వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా తన ప్రాక్టీస్ సెషన్‌కు సంబందించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో అతడు పంచుకున్నాడు. ఆ వీడియో పోస్ట్‌లకి యువ హీరోయిన్ ప్రాచీ సింగ్ కామెంట్లు పెట్టిన తీరు.. ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టీమిండియా ఓపెనర్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.

 వరుస పోస్టులు

వరుస పోస్టులు

ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా యూఏఈలోని హోటల్ నుంచి బయటికి వస్తూ స్టయిల్‌గా కళ్లద్దాలు పెట్టుకుంటున్న ఓ వీడియోని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నాడు. ఈ వీడియోకి 'హ్హ హ్హ ఐ మిస్ దట్ లాఫ్' అని హీరోయిన్ ప్రాచీ సింగ్ కామెంట్ పెట్టారు. ఆ తర్వాత పృథ్వీ షా నవ్వుతున్న ఫొటోకి 'క్యూటీ' అంటూ లవ్ ఎమోజీని జత చేశారు. ఇక్కడితో ఆగకుండా పృథ్వీ షా పోస్ట్ చేస్తున్న ప్రతి ఫొటోకీ ప్రాచీ కామెంట్లు పెట్టారు. దీంతో ప్రాచీ సింగ్, పృథ్వీ షాలు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

సన్నిహితంగా ఉండటంతో

సన్నిహితంగా ఉండటంతో

యువ నటి ప్రాచి సింగ్ పేరు టీవీ పరిశ్రమలో, ఫిల్మ్ సర్క్యూట్లో ఇప్పుడు ఒక సంచలనం. ఈ యువ నటి కలర్స్ టీవీకి చెందిన ఉడాన్ సీరియల్‌లో నటిస్తుంది. ప్రాచీ సింగ్, పృథ్వీ షా ఇద్దరూ సోషల్ మీడియాలో కాస్త సన్నిహితంగా ఉండటంతో ప్రేమలో పడ్డారు అని కామెంట్స్ చేస్తున్నారు ఫాన్స్. అయితే బాబుకి ఇంకా 20 ఏళ్ళు కూడా నిండలేదు. అంతర్జాతీయ కెరీర్‌లో షా ఇప్పటివరకు 4 టెస్టుల్లో, 3 వన్డే మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

2018 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తరుఫునే

2018 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తరుఫునే

ఐపీఎల్ 2018 సీజన్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మ్యాచ్‌‌లు ఆడుతున్న పృథ్వీ షా.. ఇప్పటి వరకూ 25 మ్యాచ్‌లాడి 598 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 99. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ని పృథ్వీ షా ఆరంభించనున్నాడు.

IPL 2020: వినూత్న రీతిలో రాజస్థాన్ రాయల్స్ జెర్సీ ఆవిష్కరణ.. లుక్ అదిరిందిగా!!

Story first published: Thursday, September 10, 2020, 15:26 [IST]
Other articles published on Sep 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+