Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పెళ్లి కాకుండానే హీరోయిన్‌తో ఆ పని చేసిన పృథ్వీ షా!

టీమిండియా వెటరన్ బ్యాటర్ పృథ్వీ షా మరోసారి వార్తల్లో నిలిచాడు.సెంచరీతో దేశవాళీ క్రికెట్ ప్రారంభించిన పృథ్వీ షా.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అకృతి అగర్వాల్‌తో వినాయక చవితి జరుపుకున్నాడు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన గణేషుడికి అకృతి అగర్వాల్‌తో కలిసి పూజ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా‌లో వైరల్‌గా మారాయి.

ఈ ఫొటోల్లో పృథ్వీ షాతో పాటు అకృతి అగర్వాల్ సంప్రదాయ దుస్తుల్లో పెళ్లైన జంటను తలపించారు. స్వయంగా అకృతి అగర్వాల్ ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. దాంతో ఈ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. పెళ్లి కాకుండా ఓ అమ్మాయి, అబ్బాయి గణపతి పూజ చేయరని, ఈ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఈ అకృతి అగర్వాల్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.

Prithvi Shaw Celebrates Ganesh Chaturthi With Actress Akriti Agarwal

లక్నోకు చెందిన అకృతి అగర్వాల్.. ముంబైలో చదువుకుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కెరీర్ ప్రారంభించి నటిగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 3.3 మిలయన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల విడుదలైన త్రిముఖ చిత్రంలో కూడా ఆమె నటించింది. అకృతి అగర్వాల్‌కు సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. పృథ్వీ షా, ఆకృతి గతంలో చాలా సార్లు కలిసి కనిపించారు. జులైలో పృథ్వీ షా షేర్ చేసిన ఓ ఫొటో కింద అకృతి కామెంట్ చేసింది. అప్పుడే ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు పుకార్లు మొదలయ్యాయి. తాజాగా ఈ ఇద్దరూ కలిసి గణపతి పూజ చేయడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. పృథ్వీ షా గతంలో ప్రాచీ సింగ్, నిధి తపాడియాతో కూడా డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

అండర్ 19 ప్రపంచకప్ విజయంతో భారత క్రికెట్‌లోకి దూసుకొచ్చిన పృథ్వీ షా అంతే వేగంగా దూరమయ్యాడు. గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలతో పాటు చెడు స్నేహాలు పృథ్వీ షా కెరీర్‌ను నాశనం చేశాయి. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో అతను అన్‌సోల్డ్‌గా నిలిచాడు. దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టు నుంచి తప్పుకున్న పృథ్వీ షా మహారాష్ట్ర తరఫున తన ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించాడు. తమిళనాడు వేదికగా సాగుతున్న బుచ్చిబాబు టోర్నీలో మహారాష్ట్ర తరఫున అరంగేట్ర మ్యాచ్‌లోనే శతకంతో చెలరేగాడు.

Story first published: Thursday, August 28, 2025, 17:54 [IST]
Other articles published on Aug 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+