Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గత పదేళ్లలో.. మా ఆయనను ఇంత సంతోషంగా ఎప్పుడూ చూడలేదు: ప్రీతి

Prithi Ashwin says I have never seen Ravichandran Ashwin this happy in 10 years

చెన్నై: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండో టెస్టు మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలిన చేదు జ్ఞాపకం, కీలక ఆటగాళ్ల గైర్హాజరీ, ఉమేశ్‌ యాదవ్‌ మ్యాచ్ మధ్యలోనే దూరమవ్వడం వంటి ప్రతికూలతల నడుమ టీమిండియా రెండో టెస్టులో గొప్పగా పోరాడింది. బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్‌ అజింక్య రాగానే శతకంతో సత్తాచాటగా.. బౌలర్లు సమష్టి ప్రదర్శన చేశారు.

అశ్విన్‌ను ఇంత సంతోషంగా ఎప్పుడూ చూళ్లేదు

బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించడంతో భారత ఆటగాళ్లు, అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. దీనిపై భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి అశ్విన్ స్పందించారు. మ్యాచ్ తర్వాత తన భర్త ఎలా ప్రవర్తిస్తున్నారో చెప్తూ ఓ ట్వీట్ చేశారు. 'చాలాసార్లు టెస్టు మ్యాచులు ఆడిన తర్వాత నేను అశ్విన్‌ను చూశా. తనతో మాట్లాడా. కానీ అతను ఎప్పుడూ ఇంత సంతోషంగా కనిపించలేదు. సరిగ్గా చెప్పాలంటే.. గడిచిన పదేళ్లలో ఎప్పుడూ అశ్విన్‌ను ఇంత సంతోషంగా చూడలేదు' అని ప్రీతి ట్వీట్ చేశారు.

అద్భుత విజయం

అద్భుత విజయం

రవిచంద్రన్ అశ్విన్ కూడా తన అధికారిక ట్విట్టర్ ద్వారా టీమిండియాను అభినందించాడు. తొలి మ్యాచులోనే ఆకట్టుకున్న శుభ్‌మన్‌ గిల్, మహ్మద్ సిరాజ్‌లను ప్రశంసించాడు. 'జట్టు మొత్తం బాగా ఆడింది. అది అద్భుత విజయం. శుభ్‌మన్‌ గిల్, మహ్మద్ సిరాజ్ సూపర్‌' అని అశ్విన్ ట్వీట్ చేశాడు. అశ్విన్ ఎంసీజీలో భారత్ సాధించిన విజయంలో కీలక పాత్ర పోషించాడు. కీలక ఐదు వికెట్లు పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్, టిమ్ పైన్ వికెట్లు తీయగా.. రెండవ ఇన్నింగ్స్‌లో మార్నస్ లబుషేన్, జోష్ హేజిల్‌వుడ్‌ను ఔట్ చేశాడు.

అశ్విన్‌ అరుదైన ఘనత

అశ్విన్‌ అరుదైన ఘనత

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్‌ బ్యాట్స్‌మెన్లను ఔట్‌ చేసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే శ్రీలంక లెజెండ్‌ ముత్తయ్య మురళీధరన్‌ పేరిట ఉన్న ప్రత్యేక రికార్డును అధిగమించాడు. బాక్సింగ్‌ డే టెస్టు నాలుగో రోజు ఆట ఉదయం సెషన్‌లో అశ్విన్‌ ఈ ఫీట్‌ అందుకున్నాడు. ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ జోష్ హేజిల్‌వుడ్‌ను 10 పరుగుల వద్ద ఔట్‌ చేయడం ద్వారా మురళీధరన్‌ను అధిగమించాడు. అశ్విన్‌ ఔట్‌ చేసిన 192వ లెఫ్ట్‌ హ్యాండర్‌ హేజిల్‌వుడ్‌ కావడం విశేషం. ఇప్పటి వరకు 191 మంది ఎడమచేతివాటం ఆటగాళ్లను ఔట్‌ చేసిన రికార్డు మురళీధరన్‌ పేరిట ఉంది. జేమ్స్‌ ఆండర్సన్ ‌(186), గ్లెన్‌ మెక్‌గ్రాత్ ‌(172), షేన్‌ వార్న్ ‌(172), అనిల్ కుంబ్లే (167) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

'భారత్‌ ఎవరికీ తలవంచదు.. టీమిండియాపై ఆధిపత్యం సాధించడం అంత సులువు కాదు'

Story first published: Wednesday, December 30, 2020, 14:53 [IST]
Other articles published on Dec 30, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+