Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Harleen Deol థ్రిల్లింగ్ క్యాచ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫిదా!

Prime Minister Narendra Modi laud Harleen Deol on a brilliant catch, says Phenomenal. Well Done

న్యూఢిల్లీ: భారత మహిళా ఆల్‌రౌండర్ హర్లీన్ డియోల్ స్టన్నింగ్ క్యాచ్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇంగ్లండ్ మహిళలతో గత శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హర్లీన్ డియోల్ బౌండరీ లైన్ వద్ద పురుష క్రికెటర్లను తలదన్నే రితీలో బంతిని ఒడిసి పట్టుకొని ఔరా అనిపించింది. ఈ సూపర్ డూపర్ క్యాచ్‌పై దిగ్గజ క్రికెటర్లు, ఆనంద్ మహీంద్ర వంటి బిజినెస్ టైకూన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తుండగా.. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ స్టన్నింగ్ క్యాచ్‌కు ఫిదా అయ్యారు. ఇన్‌స్టా స్టోరీలో అసాధారణ క్యాచ్ అంటూ హర్లీన్ డియో‌ను ప్రశంసించారు.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా శిఖా పాండే వేసిన 19 ఓవర్‌లో అమీజోన్స్‌ (43 ) ఆడిన భారీ షాట్‌ను లాంగాఫ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న హర్లీన్‌ డియోల్‌ అత్యద్భుతమైన రీతిలో క్యాచ్‌ అందుకుని ఔరా అనిపించింది. తల మీదుగా వస్తున్న క్యాచ్‌ను ఎడమవైపు గాల్లోకి డైవ్‌ చేసి అందుకొంది. ఈ క్రమంలో బౌండరీ అవతల పడిపోతానని తెలుసుకొని బంతిని గాల్లోకి విసిరింది. బౌండరీ అవతలికి వెళ్లి మళ్లీ గాల్లోని బంతిని అందుకొనేందుకు మైదానంలోకి డైవ్‌ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో పలువురు ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తారు.

Prime Minister Narendra Modi laud Harleen Deol on a brilliant catch, says Phenomenal. Well Done

పురుష క్రికెటర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఫిట్‌నెస్, క్రీడా నైపుణ్యం చాటారంటూ మెచ్చుకుంటున్నారు. మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినప్పటికీ ఈ ఒక్క క్యాచ్‌తో ప్రపంచమంతటి దృష్టినీ తన వైపు తిప్పుకోగలిగింది భారత్ మహిళా జట్టు. ఈ ఏడాది ఇదే అత్యుత్తమ క్యాచ్ అని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసించగా.. క్రికెట్ మైదానంలో చూసిన క్యాచ్‌లలో ఇదొక గొప్ప క్యాచ్. ఉన్నత శ్రేణి ఫీల్డింగ్ అంటూ మెచ్చుకున్నారు.

పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఈ క్యాచ్ చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇది నిజమేనా లేదంటే స్పెషల్ ఎఫెక్ట్స్ ట్రిక్కా అంటూ ఆయన ట్వీట్ చేశారు. నిజమైన వండర్ ఉమన్ ఇక్కడున్నారు.. గాల్ గ్యాడట్(వండర్ ఉమన్ నటి)ను మర్చిపోండి అంటూ ట్వీట్ చేశారు.

Story first published: Sunday, July 11, 2021, 20:27 [IST]
Other articles published on Jul 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+