IPL 2020 కోసం యుఏఈ వెళ్లి.. భయపడుతున్న బాలీవుడ్ భామ!!

దుబాయ్: యూఏఈ వేదికగా మెగా లీగ్ ఐపీఎల్ 2020 సెప్టెంబరు 19 నుంచి ప్రారంభం కానుంది. అబుదాబి, దుబాయ్, షార్జా వేదికల్లో 53 రోజుల పాటు 60 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. సెప్టెంబర్ 19న జరిగే లీగ్ ఆరంభ మ్యాచులో రన్నరప్ చెన్నై సూపర్‌కింగ్స్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఢీకొట్టనుంది. దీంతో ఆటగాళ్ల అందరూ సన్నాహాలలో నిమగ్నమై ఉన్నారు.

పంజాబ్ సహ యజమాని
భారత్ కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండడంతో ఈసారి యుఎఇలో ఐపీఎల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. విదేశీ ఆటగాళ్లు బయో బబుల్ వాతావరణంలో ఉండటమే కాకుండా.. యూఏఈ పరిస్థితులకు అలవాటు పడడం అంత సులభం కాదు. అక్కడి వాతావరణ పరిస్ధితులకు అలవాటు పడేలా ప్రాంఛైజీలు తమ ఆటగాళ్లకు కావాల్సిన ఏర్పాట్లను చేశాయి. ఆయా జట్ల యాజమాన్యలు దగ్గరగా ఉండి తమ ఆటగాళ్ల బాగోగులు చూసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రీతి జింటా యూఏఈ వెళ్లారు.

వారం క్రితమే యూఏఈకి
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా వారం క్రితమే లాస్ ఏంజిల్స్ నుంచి దుబాయ్ వెళ్లారు. ప్రస్తుతం ఆమె అక్కడి హోటల్‌లో క్వారెంటైన్‌లో ఉన్నారు. క్వారెంటైన్‌లో ఉన్న ఆమె జట్టుకు ఓ వీడియో సందేశాన్ని పంపారు. ఆ వీడియోను పంజాబ్ బృందం తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. 'ప్రెట్టీ ది ఉమెన్ జట్టుకు ప్రత్యేక సందేశం పంపారు' క్యాప్షన్‌తో ఆ వీడియోను పంజాబ్ యాజమాన్యం విడుదల చేసింది.

బయో బబుల్‌లోకి అడుగుపెడుతా
'హాయ్ టీం. మీరందరూ చాలా ఫీట్‌గా కనిపిస్తున్నారు. మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న సందేశాలను ఎప్పటికప్పుడు చూస్తునే ఉన్నా. ఇప్పుడు నేను క్వారెంటైన్‌లో ఉన్నా. త్వరలోనే నేను కూడా బయో బబుల్‌లోకి అడుగుపెడుతా. అక్కడ కలుద్దాం' అని వీడియోలో ప్రీతి జింటా చెప్పారు. ఐపీఎల్ రాగానే ఈ బాలీవుడ్ భామ ప్రీతి సందడి కూడా మెుదలవుతుంది. ప్లై కిసింగ్,డాన్స్ చేస్తూ పంజాబ్ ఆటగాళ్లను ప్రీతి పోత్సాహిస్తునే ఉంటారు.

కొంచెం భయంగా ఉంది
మరో వీడియోలో ప్రీతి జింటా మాట్లాడుతూ... 'నా క్వారెంటైన్ రేపటితో ముగియనుంది. అందుకు నేను చాలా సంతోషిస్తున్నా. ఇంకా ఒక కరోనా టెస్ట్ ఉంది. కొంచెం భయంగా ఉంది. ఎవరినీ కలవలేదు.. అయినా ఏదో మూల చిన్న భయం వెంటాడుతోంది. కచ్చితంగా నెగటివ్ వస్తుంది' అని అన్నారు. ఈరోజు ప్రీతి జట్టుతో కలిసే అవకాశం ఉంది. తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రీతి పరిచయమే. రాజకుమారుడు, ప్రేమంటే ఇదేరా సినిమాల్లో నటించారు.

ఈసారైనా పంజా విసురుతోందో
స్టార్ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా.. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగినా.. ఆఖర్లో చతికలబడటం పంజాబ్‌కు ఆనవాయితీ..! అంచనాలే లేనప్పుడు ధీటుగా పోటీ ఇవ్వడం.. కీలక సమయంలో చేతులు ఎత్తేయడం ఆ టీమ్ నైజం.! ఈ కారణంగానే గత 12 సీజన్లలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అలా లేవు. కొత్త కెప్టెన్ లోకేశ్ రాహుల్.. నూతన కోచ్ అనిల్ కుంబ్లేతో ఆ జట్టులో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఈ ఇద్దరికి తోడు టాప్ క్లాస్ మ్యాచ్ విన్నర్లతో అసలు సిసలు జట్టును తలపిస్తున్న పంజాబ్.. ఈసారైనా పంజా విసురుతోందో లేదో చూడాలి.
IPL 2020: 'చెన్నై జట్టులో అది మిస్సయింది.. టైటిల్ గెలవడం కష్టమే'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications