
చెన్నై టైటిల్ గెలవడం కష్టమే:
ఐపీఎల్ 2020 టైటిల్‌ను చెన్నైసూపర్ కింగ్స్ గెలవడం కష్టమేనంటూ సునీల్ గవాస్కర్ భిన్నమైన వ్యాఖ్యలు చేశాడు. అయితే అంతర్జాతీయ ఆటకు గుడ్‌బై చెప్పిన ఎంఎస్ ధోనీకి మాత్రం ఈ ఐపీఎల్ లాభదాయకంగా మారుతుంన్నారు. స్పోర్ట్స్‌టాక్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో లిటిల్ మాస్టర్ మాట్లాడుతూ... 'సురేశ్ రైనా, హర్బజన్ సింగ్ లేని లోటు చెన్నై జట్టులో స్పష్టంగా కనబడుతుంది. ఇద్దరు స్టార్ ఆటగాళ్ల సేవలను కోల్పోయిన చెన్నై జట్టులో ఉన్న యువ ఆటగాళ్లతో ఎంతమేరకు రాణిస్తుందనేది చూడాలి. ఎందుకంటే జట్టులో అనుభవజ్ఞులతో పాటు యువ ఆటగాళ్లు ఉంటేనే సమతూకంగా ఉంటుంది. కానీ చెన్నైలో ప్రస్తుతం అది మిస్సయింది. దీంతో చెన్నై టైటిల్ గెలవడం కొంచెం కష్టంగా మారింది' అని అన్నారు.

ధోనీకి లాభదాయకం:
'చెన్నై జట్టులో సీనియర్ ఆటగాడిగా, కెప్టెన్‌గా ఉన్న ఎంఎస్ ధోనీకి మాత్రం ఐపీఎల్ 2020 లాభదాయకంగా ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన ధోనీకి ఒత్తిడి లేకపోవడం దూకుడుగా ఆడేందుకు అవకాశం ఉంది. మహీ ఒక కెప్టెన్‌గా జట్టును విజయవంతంగా నడిపిస్తాడనంలో సందేహం లేదు. అయితే యువ ఆటగాళ్లు ఎంతమేర సహకరిస్తారనేది చూడాలి. సురేష్ రైనా మంచి ఐపీఎల్ ఆటగాడు. అందులోనూ ఎడమచేతి వాటం ప్లేయర్. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఏ జట్టుకైనా సరైన సమతుల్యతను అందిస్తుంది. రైనా స్థానాన్ని ఎవరితో భర్తీ చేయలేరు. అయితే మూడో స్థానంలో మంచి ఆటగాడిని వెతుక్కోవాలి' అని లిటిల్ మాస్టర్‌గవాస్కర్ సూచించాడు. ముంబై టైటిల్ గెలుస్తుందని ఆయన చెప్పారు.

రైనా లేకపోవడం ఎదురుదెబ్బే:
తాజాగా స్టార్‌స్పోర్ట్స్ షో క్రికెట్ కనెక్టెడ్‌లో డీన్ జోన్స్ మాట్లాడుతూ... 'సురేష్ రైనా లేకపోవడం చెన్నై జట్టుకి భారీ ఎదురుదెబ్బే. ఎందుకంటే.. ఐపీఎల్ పరుగుల వీరుల జాబితాలో టాప్-5లో ఉంటాడు. రైనాది ఎడమచేతి వాటం. అందులోనూ స్పిన్‌ను బాగా ఆడతాడు. సీఎస్‌కేలో ఎక్కువ మంది కుడి చేతి వాటం ఆటగాళ్లే కావడం ఓ బలహీనత. ఆ జట్టుకు ఎడమచేతి వాటం బ్యాటర్లు అవసరం. లేదా ఆ జట్టు ఆటగాళ్లు లెగ్ స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోవాలి. అందుకే సామ్ కరన్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, ఇమ్రాన్ తాహిర్‌ను ఎంచుకోవడం మంచిది' అని పేర్కొన్నాడు.

సెప్టెంబర్ 19న తొలి మ్యాచ్:
ఐపీఎల్ 13వ సీజన్‌కు గతేడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో చెన్నై జట్టు కేవలం నలుగురిని మాత్రమే కొనుగోలు చేసింది. మిగతావారిని అట్టిపెట్టుకుని 'డాడీస్ ఆర్మీ' ట్యాగ్‌గా ముద్రించుకుంది. రైనా, హర్భజన్ గైర్హాజరీలో చెన్నై జట్టులో ఎంఎస్ ధోనీ, ఫాఫ్ డుప్లెసిస్, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, షేన్ వాట్సన్ లాంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్‌లో జోష్ హాజల్‌వుడ్, డ్వేన్ బ్రేవో, ఇమ్రాన్ తాహిర్, మిచెల్ సాంట్నర్‌లు ఉన్నారు. చెన్నై జట్టు ముంబైతో సెప్టెంబర్ 19న తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
ENGvsAUS: సిక్సర్లతో బెంబేలెత్తించిన మాక్స్‌వెల్.. భారీ టార్గెట్ ఛేదించిన ఆసీస్.. వన్డే సిరీస్


Click it and Unblock the Notifications












