కరీబియన్ లీగ్‌లో ఆడనున్న 48 ఏళ్ల తాంబే.. తొలి భారత క్రికెటర్‌గా రికార్డు!!

ముంబై: భారత వెటరన్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే ప్రతిఒక్క క్రికెట్ అభిమానికి సుపరిచితమే. 41 ఏళ్ల వయసులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అరంగేట్రం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో కనిపించని ఈ వెటరన్ లెగ్‌స్పిన్నర్ ప్రవీణ్ తాంబే త్వరలో ఓ విదేశీ లీగ్‌లో ఆడనున్నాడు. 48 ఏళ్ల తాంబే కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)కు ఎంపికయ్యాడు.

సీపీఎల్‌లో ఆడనున్న తాంబే:
సోమవారం జరిగిన సీపీఎల్ ఆటగాళ్ల వేలంలో ప్రవీణ్ తాంబేను టిన్‌బాగో నైట్ రైడర్స్ దక్కించుకున్నది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్.. టిన్‌బాగో జట్టుకు కూడా కో ఓనర్‌గా ఉన్నారు. సీపీఎల్ లీగ్‌లో ఆడేందుకు బీసీసీఐ నుంచి తాంబే నిరభ్యంతర పత్రం తీసుకున్నాడు. 2020 లీగ్ కోసం ఆరు సీపీఎల్ ఫ్రాంచైజీలు జట్లను ఎంపిక చేసుకున్నాయి. తాంబేతో పాటు చాలా మంది ఆటగాళ్లు ఎంపికయ్యారు.

తొలి భారత క్రికెటర్‌గా రికార్డు:
కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడనున్న మొదటి భారత క్రికెటర్‌గా ప్రవీణ్ తాంబే రికార్డు సృష్టించనున్నాడు. విండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కీరోన్ పొలార్డ్ నేతృత్వంలోని టిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు తరఫున తాంబే ఆడనున్నాడు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడ్డ సీపీఎల్ కొత్త సీజన్.. ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 10 వరకు షెడ్యూల్ చేశారు. సీపీఎల్-2020 సీజన్‌లో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఐపీఎల్‌లో తాంబే రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

బీసీసీఐ వేటు:
ఐపీఎల్-13వ సీజన్ వేలంలో భారత వెటరన్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబే (48) పాల్గొనగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రాంచైజీ అతడి ప్రాథమిక ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ వేలంలో అమ్ముడైన అతి పెద్దవయస్సు క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. అయితే అబుదాబి టీ10 లీగ్‌లో ప్రవీణ్.. నార్తర్న్ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. బోర్డులోని క్రికెటర్ భారత్ బయట జరిగే ఫ్రాంచైజీ లీగ్‌లలో పాల్గొనకూడదు. దీంతో అతనిపై వేటు పడింది.

క్రికెట్‌పై ఉన్న ఇష్టంతో:
48 ఏళ్ల ప్రవీణ్ తాంబే క్రికెట్‌పై ఉన్న ఇష్టంతో ఇంకా ఆడుతున్నాడు. 2013 సీజన్‌లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. అప్పుడు రాజస్థాన్ రాయల్స్ కనుగోలు చేసింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. 2016లో ఆడకపోయినప్పటికీ.. 2017 ఎడిషన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది కానీ.. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆపై కోల్‌కతా నైట్‌రైడర్స్ కనుగోలు చేసింది. క్రికెట్ ఆటలో 40 ఏళ్ల చివరలో కూడా ఆటను కొనసాగించడం చాలా అరుదు. కానీ తాంబే మాత్రం 48 సంవత్సరాల వయసులో కూడా ఇంకా క్రికెట్ ఆడుతున్నాడు.

33 ఐపీఎల్ మ్యాచ్‌లు.. 28 వికెట్లు
2013-16 మధ్య కాలంలో 33 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ప్రవీణ్ తాంబే.. 28 వికెట్లు పడగొట్టాడు. 2014లో రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగి 15 వికెట్లు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరపున కూడా ఆడాడు. బంతితో మెరిసినా.. బ్యాట్‌తో 18 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, ఆరు లిస్ట్-ఎ మ్యాచ్‌ల్ని తాంబే ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
ప్రేక్షకులు లేకుండా ఐఎస్‌ఎల్ ఏడో సీజన్!!