Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఫొటో లేకుంటే చచ్చిపోయేవాడిని: ప్రవీణ్ కుమార్

మానసిక ఒత్తిడిని భరించలేక తుపాకీతో కాల్చుకొని చనిపోవాలనుకున్నానని టీమిండియా మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ తెలిపాడు. అదృష్టవశాత్తు ఆ సమయంలో తన పిల్లల ఫొటోను చూసి ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నానని ఈ స్టార్ పేసర్ గుర్తు చేసుకున్నాడు. తన కారణంగా అభం శుభం తెలియని పిల్లలు కష్టాలు పాలవ్వడం ఎందుకని తన నిర్ణయాన్ని మార్చుకున్నానని తెలిపాడు.

ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రవీణ్ కుమార్ తన కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 2011 వన్డే ప్రపంచకప్ ఆడేందుకు తన గాయం విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశానని, వయసు విషయంలోనూ రెండేళ్లు తక్కువగా చూపించుకున్నానని చెప్పుకొచ్చాడు.

Praveen Kumar reveals he wanted to shoot himself when depression took over

బౌలర్లు బాల్ ట్యాంపరింగ్ చేయడం సహజమని, పాకిస్థాన్ బౌలర్లు ఎక్కువగా చేసేవారని తెలిపాడు. ఈ ఇంటర్వ్యూలో ప్రవీణ్ కుమార్ చాలా నిజాయితీగా సమాధానాలు చెప్పాడు. తాను మద్యం సేవిస్తానని, కానీ ఓ మాజీ ప్లేయర్ కారణంగా తనపై తాగుబోతనే ముద్ర పడిందని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో అప్పటి చైర్మెన్ లలిత్ మోడీ తనను బెదిరించాడని కూడా గుర్తు చేసుకున్నాడు.

బౌలింగ్ కోచ్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిద్దామనుకున్న తనకు ఎవరూ అవకాశాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. '2018లో రిటైర్మెట్ ప్రకటించిన అనంతరం ఎవరూ కూడా నన్ను సంప్రదించలేదు. క్రికెట్‌లో ఇంత సాధించినా ఎవరూ నన్ను గుర్తించకపోవడం నన్ను బాధించింది. తాగుబోతు అనే ముద్ర వేయడంతో ఎవరూ నాకు కోచ్‌గా అవకాశం ఇవ్వలేదు.

చివరకు నా సొంత రాష్ట్రమైన యూపీ జట్టులో కూడా కోచ్‌గా అవకాశం దక్కలేదు. ఐపీఎల్‌లో ఏదైనా ఫ్రాంచైజీ బౌలింగ్ కోచ్‌గా నన్ను తీసుకుంటుందని భావించాను. కానీ ఎవరూ సంప్రదించకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాను. అనవసర ఆలోచనలతో నిద్రలేని రాత్రులు గడిపాను. ఒక రోజు ఎవరి కోసం బతకాలి.. చనిపోవడం ఉత్తమమని, తుపాకీ తీసుకొని కారులో బయటకు వెళ్లాను. తుపాకీతో కాల్చుకొని చనిపోవాలనుకున్నాను.

కానీ కారులో నా పిల్లల ఫోటోను చూసి నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. పసి పిల్లలను కష్టాలు పాలు చేయడం ఎందుకని రియలైజ్ అయ్యాను. అనంతర వైద్యుడిని సంప్రదించి డిప్రెషన్‌ నుంచి బయటపడ్డాను. భారత్‌లో చాలా మందికి మానసిక ఒత్తిడి అంటే తెలియదు? ఎవరికి అర్థం కాదు. దాంతో నేను ఎవరితో నా బాధను పంచుకోలేకపోయాను.

అనవసర ఆలోచనలతో బాధపడ్డాను. నా అంతర్జాతీయ కెరీర్ అర్థాంతరంగా ముగిసింది. అద్భుత ప్రదర్శన కనబర్చిన తర్వాత కూడా అవకాశాలు అందుకోలేకపోయాను.'అని ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చాడు. కుస్తీ యోధుల కుటుంబం నుంచి ప్రవీణ్ కుమార్.. కాస్త మొరటుగా కనిపించేవాడు. చీటికి మాటికి ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. ఈ కోపమే అతని కెరీర్‌ను నాశనం చేసిందని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతుంటారు.

Story first published: Sunday, January 14, 2024, 18:26 [IST]
Other articles published on Jan 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+