For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: సిరాజ్ కాదు.. అతని వల్లే టీమిండియా గెలిచింది!

ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్ట్‌లో టీమిండియా చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఓవల్ వేదికగా ఐదు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన పోరులో పడిలేచిన టీమిండియా 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసుకుంది. మహమ్మద్ సిరాజ్(5/104) అద్వితీయమైన బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 374 పరుగుల లక్ష్యచేధనలో 339/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్.. సిరాజ్ ధాటికి 367 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 224 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 247 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌‌లో భారత్ 396 పరుగులు సాధించింది.

సిరాజ్.. ఒక్కడే కాదు

తొలి ఇన్నింగ్స్‌లోనూ సిరాజ్(4/86) నాలుగు వికెట్లు తీసాడు. దాంతో సిరాజ్‌పై సర్వత్రా ప్రశంల జల్లు కురుస్తోంది. సిరాజ్ వల్లే ఈ మ్యాచ్ గెలిచిందని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఇందులో వాస్తవం ఉన్నా.. ఈ విజయంలో ప్రసిధ్ కృష్ణ పాత్ర కూడా ఉంది. అతను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌ల్లో(4/62) నాలుగు వికెట్లు తీసిన ప్రసిధ్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ (4/126) నాలుగు వికెట్లు పడగొట్టాడు.

Prasidh Krishna s Crucial Spell Complements Siraj s Heroics in India s Historic Oval Victory

అనూహ్యంగా జట్టులోకి..

జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన ప్రసిధ్ కృష్ణ అంచనాలకు మించి రాణించాడు. సిరాజ్‌కు మరో ఎండ్‌లో అండగా నిలిచాడు. ఆకాష్ దీప్ గాయంతో ఇబ్బంది పడటంతో సిరాజ్‌తో కలిసి పేస్ బాధ్యతలను పంచుకున్నాడు. ఆఖరి రోజు ఆటలో జోష్ టంగ్(0)ను ప్రసిధ్ కృష్ణ ఔట్ చేసిన తీరు ఈ మ్యాచ్‌కే హైలైట్ అని చెప్పవచ్చు. స్టన్నింగ్ యార్కర్‌తో టంగ్‌ను ప్రసిధ్ క్లీన్ బౌల్డ్ చేశాడు.

మలుపు తిప్పాడు..

అంతేకాకుండా సెంచరీతో చెలరేగిన డేంజరస్ జో రూట్‌ను ప్రసిధ్ కృష్ణ‌నే కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. చాలా తెలివిగా బౌలింగ్ చేసిన అతన్ని బుట్టలో వేసుకున్నాడు. ఈ వికెట్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. జో రూట్ ఔటవ్వకుండా ఉండి ఉంటే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ సునాయస విజయాన్ని అందుకునేది. వాస్తవానికి ప్రసిధ్ కృష్ణ ఈ సిరీస్‌ ఆరంభంలో దారుణంగా విఫలమయ్యాడు. తొలి రెండు టెస్ట్‌ల్లో(3/128, 2/92, 0/72, 1/39) 6 వికెట్లు మాత్రమే తీసిన ప్రసిధ్ కృష్ణ దారళంగా పరుగులిచ్చాడు. దాంతో తుది జట్టులో చోటు కోల్పోయాడు.

గాయంతో బుమ్రా దూరమవ్వడంతో ఆఖరి టెస్ట్‌లో అతను బరిలోకి దిగాల్సి వచ్చింది. ప్రసిధ్‌ను ఎందుకు ఆడిస్తున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. కానీ అంచనాలకు మించి రాణించి టీమిండియా చిరస్మరణీయ విజయంలో కీలక పాత్ర పోషించాడు.హెడ్ కోచ్ గౌతం గంభీర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. కానీ సిరాజ్ సంచలన ప్రదర్శనలో అతని అద్భుత ప్రదర్శన కొట్టుకుపోయింది.

Story first published: Tuesday, August 5, 2025, 10:26 [IST]
Other articles published on Aug 5, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+