IND vs AFG: అఫ్గాన్ కెప్టెన్ సెంచరీ.. నిప్పులు చెరిగిన ప్రసిధ్ కృష్ణ
అఫ్గానిస్థాన్‌తో మూడో వన్డేలో భారత పేసర్ ప్రసిధ్ కృష్ణ(5/23) నిప్పులు చెరిగాడు. వన్డేల్లో తొలి ఫిఫర్ సాధించాడు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 218 పరుగులకు కుప్పకూలింది.
అఫ్గాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది(131 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 102) సెంచరీతో చెలరేగగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్(56 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ ఐదు వికెట్లు తీయగా.. గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే తలో వికెట్ పడగొట్టారు.
రోహిత్ హ్యాట్రిక్..
ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగగా.. ప్రసిధ్ కృష్ణ ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బతీసాడు. రెండో ఓవర్‌లోనే ఔట్ స్వింగర్‌తో రెహ్మానుల్లా గుర్బాజ్‌ను క్యాచ్ ఔట్ చేశాడు. గుర్బాజ్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేయగా.. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ చేతిలో పడింది.

ప్రసిధ్ వేసిన ఆరో ఓవర్ ఆఖరి బంతిని రెహ్మత్ షా మిడ్ వికెట్ దిశగా ఫ్లిక్ షాట్ ఆడబోగా.. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. స్లిప్‌లో ఉన్న రోహిత్ ఎడమవైపు జరిగి ఈజీగా అందుకున్నాడు. ప్రసిధ్ కృష్ణ వేసిన 8వ ఓవర్ రెండో బంతిని ఇబ్రహీం జడ్రాన్.. కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ చేతిలోకి దూసుకెళ్లింది. దాంతో రోహిత్ శర్మ హ్యాట్రిక్ క్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు.
ఆదుకున్న కెప్టెన్..
ఇక ప్రసిధ్ కృష్ణ వేసిన 10వ ఓవర్ రెండో బంతికి డార్వాష్ రసూలీ(1) కూడా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అయితే ఈ క్యాచ్‌ను శ్రేయస్ అయ్యర్ అందుకున్నాడు. ప్రసిధ్ కృష్ణ ధాటికి అఫ్గానిస్థాన్ 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ హజ్ముతుల్లా షాహిది జట్టును ఆదుకున్నాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్‌తో కలిసి ఐదో వికెట్‌కు 105 పరుగులు జోడించాడు.
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఒమర్జాయ్‌ను ప్రిన్స్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. మహమ్మద్ నబీ(21) ఆచితూచి ఆడగా.. గుర్నూర్ బ్రార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. రషీద్ ఖాన్(5), అల్లా ఘజన్‌ఫర్(1) విఫలమైనా.. హష్మతుల్లా షాహిదీ 128 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి వికెట్‌గా అతన్ని ప్రసిధ్ కృష్ణ ఔట్ చేసి ఐదు వికెట్ల ఘనతను అందుకోవడంతో పాటు అఫ్గాన్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications