Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్ కిట్ కోసం రోహిత్ శర్మ పాల ప్యాకెట్లు అమ్మిండు: ప్రజ్ఞాన్ ఓజా

Pragyan Ojha says Rohit Sharma once delivered milk packets to buy his cricket kit

న్యూఢిల్లీ: క్రికెట్ కిట్ కోసం పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్ శర్మ (Rohit Sharma) టీమిండియా కెప్టెన్‌గా ఎదగడం చాలా గర్వంగా ఉందని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్, మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా (Pragyan Ojha) అన్నాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన రోహిత్ శర్మ‌కు కెరీర్ ప్రారంభంలో క్రికెట్ కిట్ కొనేందుకు కూడా డబ్బులు లేవని ఈ హైదరాబాద్ స్టార్ గుర్తు చేసుకున్నాడు. క్రికెట్ కిట్‌తో పాటు పాకెట్ మనీ కోసం రోహిత్ శర్మ పాల ప్యాకెట్లు డెలివరీ చేసేవాడని చెప్పుకొచ్చాడు. ఓ దిగువ మధ్య తరగతికి చెందిన అబ్బాయి.. ఇప్పుడు భారత క్రికెట్‌ను శాసిస్తుండటం గొప్పగా అనిపిస్తుందన్నాడు.

ఏజ్ క్రికెట్ నుంచి రోహిత్ శర్మతో కలిసి ఆడిన ప్రజ్ఞాన్ ఓజా.. ఐపీఎల్ ఆరంభంలో డెక్కన్ చార్జర్స్ టీమ్‌కు కలిసి ఆడారు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ ఇద్దరూ.. 2013, 2015 సీజన్ టైటిళ్లను ముంబై గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఐపీఎల్ 2023 నేపథ్యంలో జియో సినిమా యాప్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రజ్ఞాన్ ఓజా.. రోహిత్ శర్మకు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అండర్ 15 నేషనల్ క్యాంప్‌లో రోహిత్ శర్మతో తొలిసారి పరిచయమైందని చెప్పిన ఓజా.. అప్పుడు రోహిత్ తన కష్టాలను పంచుకున్నాడని గుర్తు చేసుకున్నాడు.

'అండర్‌-15 నేషనల్‌ క్యాంపులో తొలిసారి రోహిత్‌ శర్మను కలిసాను. అతనో స్పెషల్ ప్లేయరని అంతా చెప్పేవారు. ఆ క్యాంప్‌లో అతనికి ప్రత్యర్థిగా ఆడిన నేను రోహిత్ శర్మ‌ను ఔట్ చేశాను. ముంబై నుంచి వచ్చినా.. రోహిత్ శర్మ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఆడేటప్పుడు మాత్రం చాలా దూకుడుగా ఉండేవాడు. మా ఇద్దరికీ ఎక్కువ పరిచయం లేకపోయినా అతను నా పట్ల చాలా దూకుడుగా ఉండటం అర్థమయ్యేది కాదు. కానీ ఆ తర్వాత మా మధ్య స్నేహం మొదలైంది.

రోహిత్ శర్మ మిడిల్‌క్లాస్‌ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఆ సమయంలో అతను చెప్పిన కొన్ని మాటలు ఇప్పటికి నాకు ఇంకా గుర్తున్నాయి. క్రికెట్‌ కిట్ల బడ్జెట్ గురించి మాట్లాడితే అతను చాలా భావోద్వేగానికి గురయ్యేవాడు. నిజం చెప్పాలంటే అతను పాల ప్యాకెట్లనూ అమ్మాడు. అయితే అదంతా చాలా కాలం కిందట. అలా పాల ప్యాకెట్లు వేయడం ద్వారా వచ్చిన డబ్బుతో క్రికెట్ కిట్‌ కొనేవాడు. అందుకే అతన్ని ఇప్పుడు చూస్తుంటే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి భారత క్రికెట్‌ను శాసిస్తుండటం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.

అప్పుడు మొదలైన మా స్నేహం ఇంకా కొనసాగుతూనే ఉంది. రోహిత్ శర్మ చాలా సరదాగా ఉంటాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో తన ప్రాంక్స్‌తో అందర్నీ ఆటపట్టించేవాడు. రంజీ ట్రోఫీ ఆడే వరకు ముఖ పరిచయం మాత్రమే ఉన్న మా మధ్య.. అతని మిమిక్, హాస్య చతురత నన్ను రోహిత్‌కు దగ్గర చేసింది. అండర్ 19 స్థాయిలో ఆడుతున్నప్పుడు ఒత్తిడికి గురైనప్పుడల్లా రోహిత్ తన చర్యలతో నవ్వులు పూయించేవాడు.'అని ప్రజ్ఞాన్ ఓజా చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, March 28, 2023, 15:59 [IST]
Other articles published on Mar 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+