Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Risabh Pant టీమిండియా భవిష్యత్ కెప్టెన్: ప్రజ్ఞాన్ ఓజా

Pragyan Ojha backs Delhi Capitals’ Skipper Rishabh Pant to lead Team India in the future

న్యూఢిల్లీ: టీమిండియా యువ వికెట్ కీపర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ఆటగాడిగా, నాయకుడిగా అభివృద్ధి చెందుతున్నాడని భారత మాజీ స్పిన్నర్, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ ప్రజ్ఞాన్ ఓజా అన్నాడు. రాబోయే కాలంలో రిషభ్‌ పంత్‌ పరిణతి చెందిన నాయకుడిగా అభివృద్ధి చెంది భవిష్యత్‌లో భారత జట్టును నడిపిస్తాడని ఈ హైదరాబాద్ మాజీ స్పిన్నర్ విశ్వాసం వ్యక్తం చేశాడు.

భుజం గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ దూరం కావడంతో అతని స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌‌ను రిషభ్ పంత్ నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన పంత్.. నాలుగింటిలో జట్టుకు విజయాన్నందించాడు.

చెత్త కెప్టెన్సీ..

చెత్త కెప్టెన్సీ..

అయితే మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జరిగిన మ్యాచులో ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో రిషభ్ పంత్ (48 బంతుల్లో 6 ఫోర్లుతో 58 నాటౌట్), హెట్‌మైర్‌ ( 25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 నాటౌట్) పోరాడిన ఫలితం లేకపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ పరాజయానికి రిషభ్ పంత్ కెప్టెన్సీనే కారణమని భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ మిశ్రాతో పూర్తి కోటా బౌలింగ్ చేయించకుండా ఘోర తప్పిదం చేశాడని విమర్శించారు. ఈ క్రమంలోనే పంత్‌ను ఓజా వెనుకేసుకొచ్చాడు.

భవిష్యత్ కెప్టెన్..

భవిష్యత్ కెప్టెన్..

ఇండియా టుడేతో మాట్లాడుతూ.. పంత్‌కు అండగా నిలిచాడు. 'జట్టును నడిపించే విధానం, బ్యాటింగ్‌లో ఇదే విధమైన పరిపక్వతను కొనసాగిస్తే పంత్ భవిష్యత్‌లో భారత జట్టు కెప్టెన్‌ అవుతాడనే నమ్మకం నాకుంది. రిషభ్ గురించి తెలుసుకుని.. ప్రజలతో మాట్లాడిన తర్వాత అతడు టీమిండియాకు కెప్టెన్‌గా ఉండాల్సిన వ్యక్తిగా భావిస్తున్నా.

సౌరవ్ గంగూలీ.. ధోనీలోని నాయకత్వ లక్షణాలను ఇలానే వెలుగు చూశాయి. పంత్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. దానికింకా చాలా సమయం ఉంది. కానీ ప్రస్తుతం పంత్..తనను తాను ఆటగాడిగా, నాయకుడిగా అభివృద్ధి చేసుకుంటున్న విషయాన్ని నిశితంగా గమనించాలి. రవిశాస్త్రి భాయ్‌ (టీమిండియా ప్రధాన కోచ్‌) శిక్షణలో పంత్‌ రాటుదేలుతాడని భావిస్తున్నా'' అని ఓజా పేర్కొన్నాడు.

ఉత్కంఠ విజయం..

ఉత్కంఠ విజయం..

ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 రన్స్ చేసింది. ఏబీ డివిలియర్స్(42 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 75 నాటౌట్) పరుగుల విధ్వంసానికి అండగా యువ ప్లేయర్ పటిదార్(22 బంతుల్లో 2 సిక్స్‌లతో 31), గ్లేన్ మ్యాక్స్‌వెల్(20 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 25) సత్తా చాటారు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, అవేశ్ ఖాన్, రబడా, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు.

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 రన్స్ చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్(48 బంతుల్లో 6 ఫోర్లతో 58 నాటౌట్), షిమ్రన్ హెట్‌మైర్(25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో పోరాడిన ఫలితం లేకపోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 2 వికెట్లు తీయగా.. సిరాజ్, జెమీసన్ తలో వికెట్ దక్కించుకున్నారు.

Story first published: Wednesday, April 28, 2021, 14:47 [IST]
Other articles published on Apr 28, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+