Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆయన వల్లే ఈ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన: ప్రఫుల్ హింగే

సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్ సహకారంతోనే మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయగలిగానని ఆ జట్టు నయా పేసర్ ప్రఫుల్ హింగే తెలిపాడు. అరంగేట్రంలోనే సత్తా చాటాలని గతేడాదే నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 57 పరగుల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన ప్రఫుల్ హింగే.. ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసి ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు. విధ్వంసకర బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని గోల్డెన్ డకౌట్ చేశాడు. మొత్తం నాలుగు వికెట్లతో అరంగేట్ర మ్యాచ్‌లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

నేను ముందే రాసుకున్నా

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రఫుల్ హింగే తన కెరీర్‌కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. తన కుటుంబంతో పాటు ఎమ్ఆర్‌ఎఫ్ ఫౌండేషన్ తనకు అండగా నిలిచిందని గుర్తు చేసుకున్నాడు. వైభవ్ సూర్యవంశీని మొదటి బంతికే ఔట్ చేస్తానని చెప్పానని, అన్నట్లుగానే పెవిలియన్ చేర్చానని తెలిపాడు.

Praful Hinge Reveals the Masterplan Behind His Historic First-Ball Wicket of Vaibhav Sooryavanshi In SRH vs RR Clash
Photo Credit: screen grab for JioHotstar

'ఈ అరంగేట్రాన్ని నేను ముందే ఊహించాను. గతేడాదే నేను ఆడే తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే కచ్చితంగా నాలుగు, ఐదు వికెట్లు తీస్తానని ఒక చోట రాసుకున్నా. పవర్ ప్లేలో వీలైనంత వరకు ఆధిపత్యం చెలాయించాలని అనుకున్నా. నేను నమ్మకాలను బలంగా విశ్వసిస్తాను. 13 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. అప్పుడు నాకు లెదర్ బాల్ ఏంటో కూడా తెలియదు.

ఈ అవార్డు నా కుటుంబానికి అంకితం..

మా నాన్నను క్రికెట్ క్లబ్‌లో చేర్పించమని అడిగితే.. వయసు చిన్నదని మొదట నిరాకరించారు. కానీ అక్కడి నుంచే నా ప్రయాణం మొదలైంది. ఈ అవార్డును నా కుటుంబానికి అంకితం చేస్తున్నా. నా కోసం వారు ఎన్నో త్యాగాలు చేశారు. వారి వల్లే నేను ఈ స్థాయికి చేరాను. సూర్యవంశీ వికెట్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. సూర్యవంశీని తొలి బంతికే ఔట్ చేయాలని ముందే ప్లాన్ చేసుకున్నా. మా జట్టులోని ఒకరిద్దరితో కూడా చెప్పా. బౌన్స్‌ర్ లేదా ఇతర పద్దతిలోనైనా వైభవ్‌ను ఫస్ట్ బాల్‌కే పెవిలియన్ చేర్చుతానన్నాను.

మా బౌలింగ్ కోచ్ వరుణ్ భాయ్ నాకు చాలా సహాయం చేశారు. గతంలో గాయాలు ఇబ్బంది పెట్టినా.. ఇప్పుడు ఫిట్‌గా ఉన్నాను. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నన్ను బౌలర్‌గా తీర్చిదిద్దిన MRF ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు. నేను అక్కడ ఉన్నప్పుడు ఫిజియో నవీన్ సర్ నన్ను చాలా బాగా చూసుకున్నారు. నేను ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు చెబుతున్నా.'అని ప్రఫుల్ హింగే చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, April 14, 2026, 1:07 [IST]
Other articles published on Apr 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+