For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ball of The Century: షేన్ వార్న్ మార్క్ బౌలింగ్.. నోరెళ్లబెట్టిన హ్యారీ బ్రూక్!(వీడియో)

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య స్టన్నింగ్ డెలివరీతో దివంగత స్పిన్నర్ షేన్ వార్న్‌ను గుర్తు చేశాడు. అతని సెన్సేషనల్ బాల్‌కు ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ అనూహ్య బంతికి బిత్తరపోయిన హ్యారీ బ్రూక్.. నోరెళ్లబెట్టాడు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు బాల్ ఆఫ్ ది సెంచరీ 2.o అంటూ కొనియాడుతున్నారు.

తొలి టెస్ట్ రెండో రోజు ఆటలో ప్రభాత్ జయసూర్య వేసిన 40వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని హ్యారీ బ్రూక్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేయగా.. లోపలికి వచ్చిన బంతి అనూహ్యంగా టర్న్ అయ్యి ఆఫ్ వికెట్‌ను లేపేసింది. బంతి టర్న్ అయిన విధానం చూసి హ్యారీ బ్రూక్ షాకయ్యాడు.

Prabath Jayasuriya Gets Harry Brook With Ball of the Century Like Ripper Video Goes Viral

అప్పటి వరకు సాధికారికంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న బ్రూక్(56) ఈ సెన్సేషనల్ బాల్‌కు వెనుదిరిగాడు. ఈ బంతి 1993లో షేన్ వార్న్ వేసిన బాల్ ఆఫ్ సెంచరీని గుర్తు చేసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మూడు దశాబ్దాల క్రితం షేన్ వార్న్ వేసిన బాల్ ఆఫ్ ది సెంచరీకి మైక్ గట్టింగ్ ఔటయ్యాడు.

మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఈ తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 236 పరుగులకు కుప్పకూలింది. ధనుంజయ డిసిల్వా(74), మిలాన్ రథనాయకే(72) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్ మూడేసి వికెట్లు తీయగా.. గస్ అట్కిన్సన్ రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 61 ఓవర్లలో 6 వికెట్లకు 259 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్(56), జేమీ స్మిత్(72 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో రాణించారు. అసిత ఫెర్నాండో(3/68) మూడు వికెట్లు తీయగా.. ప్రభత్ జయసూర్య(2/58) రెండు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Friday, August 23, 2024, 12:59 [IST]
Other articles published on Aug 23, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+