Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Poyal Gosh: గౌతమ్ గంభీర్ మిస్డ్ కాల్స్‌తో వేధించేవాడు: బాలీవుడ్ బ్యూటీ

Poyal Gosh: టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌పై బాలీవుడ్ బ్యూటీ పాయల్ ఘోష్ సంచలన ఆరోపణలు చేసింది. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌తో తాను డేటింగ్‌లో ఉన్నప్పుడు గంభీర్ మిస్డ్ కాల్స్‌తో వేధించేవాడని తెలిపింది. ఈ విషయం ఇర్ఫాన్ పఠాన్‌కు కూడా తెలుసని చెప్పుకొచ్చింది.

గౌతమ్ గంభీర్‌తో పాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తన వెంట పడేవారని ఎక్స్‌వేదికగా వరుస పోస్ట్‌ల్లో రాసుకొచ్చింది. ఇర్ఫాన్ పఠాన్‌తో ఐదేళ్లు డేటింగ్ చేశానని చెప్పిన పాయల్ ఘోష్.. అతనితో ప్రతీ విషయాన్ని పంచుకునేదానినని పేర్కొంది.

Poyal Gosh says Gautam Gambhir Gave Missed Calls When I Dated Irfan Pathan For 5 Years

'గౌతమ్ గంభీర్ మిస్డ్ కాల్స్‌తో నన్ను వేధించేవాడు. ఈ విష‌యం ఇర్ఫాన్‌ పఠాన్‌కు తెలుసు. ఎలాగంటే.. అత‌ను నా కాల్ లిస్ట్‌ను త‌ర‌చూ చెక్ చేస్తుండేవాడు. ఈ విష‌యం గురించి అత‌ను యూసుఫ్ ప‌ఠాన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలతో చర్చించేవాడు.

గౌతమ్ గంభీర్, బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ నా వెంట ప‌డేవారు. కానీ, నేను ఇర్ఫాన్‌ పఠాన్‌తో ప్రేమ‌లో ప‌డ్డాను. 2011 నుంచి ఐదేండ్ల పాటు ఇర్ఫాన్‌తో డేటింగ్ చేశాను. అత‌నితో నేను ప్ర‌తి విష‌యాన్ని పంచుకునేదాన్ని. అత‌నికి గంభీర్ నుంచి వ‌చ్చిన మిస్డ్ కాల్స్ కూడా చూపించేదాన్ని' అని పాయ‌ల్ ఘోష్ వరుస ట్వీట్లలో వెల్ల‌డించింది.

ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. బుద్దిమంతుడిగా కనిపించే గంభీర్‌ ఇన్ని కథలు పడ్డాడా? అతనిలో ఇన్ని షేడ్స్ ఉన్నాయా? అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇన్నాళ్లు ఈ విషయం గురించి మౌనంగా ఉన్న పాయల్ ఘోష్.. అందరి దృష్టిని ఆకర్షించేందుకే ఈ ట్వీట్స్ చేస్తుందని మరికొందరు కొట్టి పారేస్తున్నారు.

ఇక వన్డే ప్రపంచకప్ 2023లో సంచలన ప్రదర్శన కనబర్చిన మహమ్మద్ షమీ.. ఇంగ్లీష్ నేర్చుకుంటే పెళ్లి చేసుకుంటానని పాయల్ ఘోష్ చేసి ట్వీట్ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ప్రజాకర్షణ కోసమే సోషల్ మీడియా వేదికగా ఆమె సంచలన పోస్ట్‌లు చేస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ప్ర‌యాణం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అలరించిన పాయ‌ల్.. ఆ త‌ర్వాత బాలీవుడ్‌పైనే దృష్టి పెట్టింది. ప‌టేల్ కీ పంజాబీ షాదీ, కోయ్ జానే నా వంటి సినిమాల్లో మెరిసింది. ప్రస్తుతం రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్న పాయ‌ల్‌.. ర‌మాదాస్ అథ‌వాలేకు చెందిన రాజ‌కీయ పార్టీకి వైస్ ప్రెసిడెంట్‌గా ప‌నిచేస్తోంది.

Story first published: Friday, December 1, 2023, 17:18 [IST]
Other articles published on Dec 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+