ప్రపంచకప్ గెలిస్తే నగ్నంగా తిరుగుతానన్న నటి మృతి
2011 వన్డే ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిస్తే నగ్నంగా తిరుగుతానని సంచలన ప్రకటన చేసిన బాలీవుడ్ నటి పూనమ్ పాండే(32) మృతి చెందారు. గత కొంతకాలంగా సర్వైకల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పూనమ్ పాండే.. గురువారం రాత్రి మరణించినట్లు ఆమె పీఆర్‌టీమ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
'ఈ ఉదయం మాకు చాలా కఠినంగా మారింది. మా ప్రియమైన పూనమ్ పాండే తుది శ్వాస విడిచారు. సర్వైకల్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శాశ్వత విరామం తీసుకున్నారు. ఆమెతో పరిచయం ఉన్న ప్రతీ ఒక్కరి పట్ల స్వచ్చమైన ప్రేమ, ఆప్యాయతలను పంచారు. ఈ విషాదకర సమయంలో ఈ బాధకరమైన విషయాన్ని మీతో పంచుకునేందుకు చింతిస్తున్నాం.

ఆమె పంచిన ప్రేమను ఎప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటాం'అని పూనమ్ పాండే అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 2013లో 'నాషా' చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పూనమ్ పాండే తెలుగులో మాలిని అండ్ కో చిత్రంలో నటించారు. 2011 వన్డే ప్రపంచకప్ సమయంలో భారత్ విజేతగా నిలుస్తే నగ్నంగా తిరుగుతానని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు.
మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియా విజేతగా నిలబడటంతో పూనమ్ పాండే తన మాటను నిలబెట్టుకుంటూ నగ్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఆమె వార్తల్లో నిలిచారు. 2011 వన్డే ప్రపంచకప్ సందర్భంగా పూనమ్ పాండే చేసిన కామెంట్స్‌తోనే భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
ఓ రాత్రి ముంబైలోని స్టేడియంలోకి దూసుకెళ్లి రెచ్చగొట్టే వీడియో తీయడం పూనమ్ పాండే కెరీర్‌లోనే అత్యంత వివాదాస్పదమైన ఘటనగా నిలిచిపోియంది. అప్పట్లో ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగింది. ఎప్పుడూ వివాదాలతో సవాసం చేసినా..ఎంతో మంది ప్రేమను సొంతం చేసుకుంది. డేర్ అండ్ డాషింగ్‌గా నిర్ణయాలు తీసుకున్న పూనమ్ పాండే.. ఎవరికీ భయపడకుండా జీవితాన్ని కొనసాగించింది.
కానీ 32 ఏళ్ల చిన్నవయసులోనే ప్రాణాంతక వైరస్‌తో పోరాడి తుది శ్వాస విడిచింది. క్రికెట్‌తోనే ఫేమస్ అయిన పూనమ్ పాండే అకాల మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications