న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Poonam Pandey: డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ గెలిస్తే న్యూడ్‌గా కనిపించాలా?.. హాట్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!

Poonam Pandey shocking comments on WTC Final, says Should I again say I will strip if India wins this time

ముంబై: ప్రముఖ మోడల్, బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే మళ్లీ వార్తల్లో నిలిచింది. టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిస్తే ఒంటిపై బట్టల్లేకుండా పోజులిస్తానని, క్రికెటర్లనూ అలానే కలుస్తానని గతంలో షాకింగ్ కామెంట్స్ చేసిన పూనమ్ పాండే.. తాజాగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌ను ఉద్దేశించి మళ్లీ ఆ తరహా వ్యాఖ్యలే చేసింది. కరోనా టైమ్‌లో ఇటీవల పలువురికి నిత్యావసరాలు అందజేసి తన పెద్ద మనసు చాటుకున్న పూనమ్ ​పాండేను మీడియా పలకిరించింది.

ఈ క్రమంలోనే న్యూజిలాండ్, భారత్ మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ​ ఫైనల్ గురించి ఆమె ముందు ప్రస్తావించింది. దీంతో 'క్రికెట్ జరుగుతుందా? భారత్ గెలిస్తే మళ్లీ నేను బట్టలు లేకుండా​ కనిపిస్తానని మీకు చెప్పాలా?. దీని గురించి నాకేం తెలియదు. ఇంటికెళ్లి ఈ వివాదం గురించి ఆలోచిస్తాలే'అని పూనమ్ తనదైన శైలిలో బదులిచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

2011 వన్డేప్రపంచకప్​ సందర్భంగా ఇలానే షాకింగ్ వ్యాఖ్యలు చేసిన పూనమ్ పాండే.. ధోనీసేన విజేతగా నిలిస్తే న్యూడ్​గా కనిపిస్తానని చెప్పింది. పైగా ఇది పెద్ద నేరం ఏం కాదని దేశం కోసమేనని చెప్పుకొచ్చింది. (నేనేం నేరం చేయడం లేదు. నాకు క్రికెట్ అంటే పిచ్చి. దేశం కోసం న్యూడ్‌గా ఫోజులిస్తానంటున్నా. దేశం మొత్తం క్రికెట్‌ను ఇష్టపడుతుంది. ప్రతీ ఒక్కరు క్రికెట్‌ను ఆరాధిస్తారు. ఇప్పటికే నేను చాలా షూట్స్‌లో న్యూడ్‌గా నటించా. దేశం కోసం ఇలా చేయడం కరెక్టే అనిపించింది. నేనెవరికి భయపడటం లేదు'అని పేర్కొంది. అప్పట్లో అది పెద్ద చర్చనీయాంశమైంది. గతేడాది ఈమె, సామ్ బాంబేను పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత చిన్నపాటి గొడవలు జరిగినా.. ప్రస్తుతం ఈ జంట బాగానే ఉంటుంది.

భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ఆటంకాలు తప్పడం లేదు. తొలి రోజు వర్షం కారణంగా ఒక్క బంతి పడకపోగా, రెండో రోజు శనివారం వెలుతురులేమితో 66.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. సెకండ్ సెషన్ చివర్లోనే మైదానాన్ని మబ్బులు కమ్మేయడంతో అంపైర్లు ముందుగానే టీ బ్రేక్ ఇచ్చారు. ఇక చివరి సెషన్‌ ఆరంభంలో వెలుతురులేమితో మరో రెండుసార్లు అంతరాయం కలిగింది.

దీంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఇక టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (124 బంతుల్లో 1 ఫోర్‌తో 44 బ్యాటింగ్‌), అజింక్యా రహానే (79 బంతుల్లో 4 ఫోర్లతో 29 బ్యాటింగ్‌) ఉన్నారు. చతేశ్వర్ పుజారా(8) విఫలమైనా.. రోహిత్‌ (34), గిల్‌ (28) ఆకట్టుకున్నారు.

Story first published: Sunday, June 20, 2021, 12:50 [IST]
Other articles published on Jun 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X