Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెస్‌లో మెరిసిన తెలుగు తేజాలు.. మోదీ, చంద్రబాబు, జగన్ అభినందనలు

వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ 2025లో కాంస్య పతకాలు గెలిచిన తెలుగు తేజాలు కోనేరు హంపి, అర్జున్ ఇరిగేశిలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఆటపై కోనేరు హంపి, అర్జున్‌లకు ఉన్న అంకిత భావం ప్రశంసనీయమని, వారు మరెన్నో విజయాలు సాధించాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ మేరకు వేర్వేరు ట్వీట్లతో హంపి, అర్జున్‌లను మోదీ కొనియాడారు.

'దోహా వేదికగా జరిగిన ఫిడే ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ 2025 మహిళల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించి, టోర్నీని ఘనంగా ముగించిన కోనేరు హంపికి అభినందనలు. ఈ క్రీడ పట్ల ఆమెకున్న అంకితభావం ఎంతో ప్రశంసనీయం. భవిష్యత్తు‌లో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తూ ఆమెకు శుభాకాంక్షలు.'అని హంపి మోదీ ట్వీట్ చేశారు.

PM Narendra Modi Chandrababu Naidu and YS Jagan Mohan Reddy Congratulate Chess Champions Koneru Humpy and Arjun

'దోహాలో జరిగిన ఫిడే ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్ ఓపెన్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అర్జున్ ఇరిగైసిని చూసి గర్విస్తున్నాం. అతను ప్రదర్శించిన పట్టుదల అద్భుతం. భవిష్యత్తు ప్రయత్నాల్లో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.'అని మోదీ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా హంపి, అర్జున్ ఇరిగేశిలను ప్రశంసించారు. 'ఒక్క ఫలితంతో విజేతలను అంచనా వేయలేం. అత్యున్నత స్థాయిలో పదేపదే పోటీపడే సాహసమే వారిని నిలబెడుతుంది. ప్రపంచ వేదికపై కాంస్యం సాధించడం హంపి నైపుణ్యానికి నిదర్శనం. హంపి ప్రయాణం, నిలకడ దేశంలోని లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుంది' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

అదేవిధంగా అర్జున్ ఎరిగైసిని కూడా ఏపీ సీఎం కొనియాడారు. 'పురుషుల్లో గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక భారత క్రీడాకారుడిగా అర్జున్ నిలిచారు. తెలంగాణ బిడ్డ అయిన అర్జున్, భారత చెస్ కీర్తి కిరీటంలో మరో ఘనతను చేర్చారు' అని చంద్రబాబు అన్నారు.

మహిళల విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన హంపి.. టైటిల్ నిలబెట్టుకోవడానికి ఆఖరిదాకా పోరాడింది. 11 రౌండ్లలో 8.5 పాయింట్లతో జు జినైర్(చైనా), అలెగ్జాండ్రా గొర్యాచ్‌కినా(రష్యా)తో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచింది. కానీ టైబ్రేక్ స్కోరులో హంపి మూడో స్థానంలో నిలిచింది. అలెగ్జాండ్రా గొర్యాచ్‌కినా ఛాంపియన్‌గా నిలవగా.. జినెర్‌కు రజతం దక్కింది.

ఓపెన్ విభాగంలో అర్జున్ సత్తా చాటాడు. 9.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చెస్‌లో అర్జున్‌కు ఇదే తొలి మెడల్. వరల్డ్ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్(నార్వే) ఆరోసారి ప్రపంచ ర్యాపిడ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

Story first published: Monday, December 29, 2025, 18:01 [IST]
Other articles published on Dec 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+