Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రధానితో ప్రపంచ ఛాంపియన్స్!

టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత అంధుల క్రికెట్ జట్టు గురువారం ప్రధాని నరేంద్ర మోదీ‌ని మర్యాదపూర్వకంగా కలుసుకుంది. ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఆటోగ్రాఫ్స్ చేసిన బ్యాట్‌ను ఈ సందర్భంగా భారత్ బృందం ప్రధానికి బహుమతిగా అందజేసింది.

జట్టు సభ్యులకు ప్రధాని స్వీట్లు తినిపించడంతో పాటు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. ఆరు దేశాలు పోటీపడిన ప్రపంచకప్‌లో ఫైనల్లో నేపాల్‌ను ఓడించి భారత్ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ జట్టుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దీపిక సారథ్యం వహించింది.

సత్యసాయి జిల్లా అమరాపురం మండలం తంభాలట్టికి చెందిన దీపిక.. ప్రపంచకప్ విజయంతో ప్రధానిని కలుసుకుంది. తమ జట్టు సాధించిన ట్రోఫీని ప్రధాని నరేంద్ర మోదీకి చూపించింది.

PM Modi Congratulates India s Women s Blind Cricket Team After Their T20 World Cup Triumph

ఈ సందర్భంగా సుమారు 45 నిమిషాల పాటు జరిగిన ఇష్టాగోష్ఠిలో దీపిక, పాడేరు యువ క్రికెటర్‌ కరుణ కుమారి.. మోదీతో మాట్లాడారు. దీపిక పాటలు బాగా పాడుతుందని తెలిసి ఆమెను మోదీ ఒక పాట పాడాలని కోరారు. దాంతో దీపిక శివుని భక్తి గీతం పాడగా.. ఆమెను మోదీ అభినందించారు. కొన్ని క్రికెట్‌ బంతులపై జట్టు సభ్యులు మోదీ సంతకాలు తీసుకున్నారు.

Story first published: Friday, November 28, 2025, 12:08 [IST]
Other articles published on Nov 28, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+