
హసన్ అలీపై పేలుతున్న సెటైర్లు..
దాంతో హసన్ అలీ విలన్ అయ్యాడు. సోషల్ మీడియా వేదికగా అతనిపై తీవ్ర ట్రోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా భారత అభిమానులు హసన్ అలీపై ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. తమ ఎడిటింగ్ నైపుణ్యాలకు పదును పెడుతూ మరీ నవ్వులూ పూయిస్తున్నారు. ఈ క్రమంలోనే హసన్ అలీపై ఫన్నీగా రూపోదించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ.. హసన్ అలీకి ఫోన్ చేసినట్లుగా ఉన్న ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటుంది. భారత అథ్లెట్లు విజయాలు సాధించిన ప్రతీసారి ప్రధాని నరేంద్ర మోదీ వారిని అభినందించడం, ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడటం తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్ 2020లో పతకాలు సాధించిన ప్రతీ ఒక్కరితో మోదీ ఇలానే ప్రవర్తించాడు.

మోదీ ఫోన్ చేసినట్లు...
ఈ నేపథ్యంలోనే 130 కోట్ల భారత ప్రజలను తన చెత్తాటతో సంతోషపరిచిన హసన్ అలీకి ప్రధాని మోదీ ఫోన్ చేసి అభినందించాడనే పాయింట్‌తో ట్రోలర్స్ ఈ వీడియోను రూపొందించారు. ఈ వీడియోలో అచ్చం మోదీలా ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి.. హసన్ అలీని ఓదార్చే ప్రయత్నం చేశాడు. 'మేరా భాయ్ హసన్ జీ.. ఈ హిందూస్తాన్ మొత్తం నీ వెనుకాలే ఉంది. ఏడ్వకు హసన్ జీ.. మా జట్టులో హార్దిక్ పాండ్యా ఎలాగో.. పాకిస్థాన్‌లో నువ్వు అలాంటి ఆల్‌రౌండర్‌వి. ఏడ్వకు ఏడ్వకు హసన్ జీ.. యావత్ భారత్ నీకు అండగా ఉంది. నీవు వదిలేసిన క్యాచ్‌తో ఫించ్ గెలిచాడంతే. ఊకో ఊకో ఏడ్వకు.. భారత ప్రజలంతా నీకు అండగా ఉన్నారు 'అంటూ మోదీలా మాట్లాడిన వ్యక్తి చెప్పుకొచ్చాడు.

ఆసీస్ హీరో మాథ్యూ వేడ్..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్(52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67), ఫకార్ జమాన్(29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ బాబర్ ఆజామ్(34 బంతుల్లో 5 ఫోర్లతో 39) పర్వాలేదనిపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 177 పరుగుల లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 19 ఓవర్లలోనే 5 వికెట్లకు 177 పరుగులు చేసి 6 బంతులుండగానే విజయాన్నందుకుంది. మాథ్యూ వేడ్, మార్కస్ స్టోయినిస్‌లకు అండగా డేవిడ్ వార్నర్(30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49), మిచెల్ మార్ష్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28) రాణించారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా.. షాహిన్ షా ఓ వికెట్ దక్కించుకున్నాడు.


Click it and Unblock the Notifications
