ప్రేక్షకుల్లేకుండా మ్యాచ్‌లా? అబ్బే.. బాగుండదు: సచిన్

ముంబై: కరోనా వైరస్ నేపథ్యంలో ఖాళీ స్టేడియాల్లో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించాలంటూ వస్తున్న ప్రతిపాదనపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పెదవి విరిచాడు. ప్రేక్షకుల్లేకుండా ఖాళీ స్టేడియాల్లో ఆడడం ఆటగాళ్లను తీవ్రంగా నిరాశపరుస్తుందని మాస్టర్ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లు.. ప్రేక్షకులకు ప్రతిస్పందించే సందర్భాలు చాలానే ఉంటాయని పేర్కొన్నాడు. మంచి షాట్ కొట్టినప్పుడు ప్రేక్షకులు స్పందించే తీరు వల్ల ఆటగాళ్లకు కొత్త శక్తి వస్తుందని తెలిపాడు. శుక్రవారంతో 47వ వసంతంలోకి అడుగుపెట్టిన ఈ భారత రత్నం.. పీటీఐ వార్త సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ప్రేక్షకుల మధ్య ఆ మజాయే వేరు..
‘ఏ ఆటలోనైనా ప్రేక్షకులు కూడా భాగమే. మీకు అనుకూలంగా అయినా వ్యతిరేకంగా అయినా వారి ప్రోత్సాహం, కేకలు క్రీడలో చాలా అవసరం. మైదానంలో ఖాళీ స్టేడియాల మధ్య ఆడటం క్రీడాకారులను తీవ్రంగా నిరాశపరుస్తుంది. ప్రేక్షకులకు ఆటగాళ్లు స్పందించే ఘటనలు అనేకం. నేను ఏదైనా మంచి షాట్ ఆడినప్పుడు ప్రేక్షకులు అభినందిస్తే మరింత ఊపు వస్తుంది. బౌలర్ కూడా అద్భుతమైన స్పెల్ వేసినప్పుడు అభిమానులు ప్రశంసిస్తుంటే బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి పెరిగిపోతుంది.'అని సచిన్ చెప్పుకొచ్చాడు.

హగ్గింగ్.. టచ్చింగ్ ఉండవ్..
పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత క్రికెట్ ఎలా ఉండబోతుందన్న ప్రశ్నకు సచిన్ సమాధానం ఇస్తూ.. ‘కరోనా తర్వాత ఆటలో సహజంగానే మార్పులు వస్తాయి. సహచరుల మధ్య కౌగిలింతలు, అభినందనలు కొంత కాలం కనిపించకపోవచ్చు. ఇక బంతి మెరుపు పెంచేందుకు ఉమ్మిని వాడాలంటే భయపడతారు. ఒకటి మాత్రం స్పష్టం. క్రికెట్ జరగాలని నేనూ కోరుకుంటాను. అయితే అంతా బాగుందని, ఆరోగ్యాలకు ప్రమాదం లేదని భావించినప్పుడే మళ్లీ ఆట మొదలు పెట్టాలి. ఇలాంటి విపత్కర పరిస్థితిని దాటిన తర్వాతే ఐపీఎల్, టి20 వరల్డ్‌కప్ గురించి ఆలోచించాలి. ప్రస్తుతం వీటిపై అసలు చర్చించడమే నా దృష్టిలో అనవసరం.'అని మాస్టర్ చెప్పుకొచ్చాడు.

వేడుకలు లేవు...
కరోనా కారణంగా దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం తన పుట్టిన రోజు వేడుకలను సచిన్ నిర్వహించుకోవడం లేదని ఆయన సన్నిహితుడొకరు తెలిపిన విషయం తెలిసిందే. ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిషులు కష్టపడుతున్నో ఫ్రంట్ లైన్ కార్మీకుల సేవలకు గౌరవంగా సచిన్ బర్త్ డే సెలెబ్రేషన్స్ జరుపుకోవడం లేదన్నారు. ‘సంబరాలకు ఇది సరైన సమయం కాదని సచిన్ భావిస్తున్నాడు. కరోనాపై పోరులో ముందున్న వైద్యులు, నర్సులు, పోలీసులు, ఇతర సిబ్బందికి మనం అండగా నిలవడం మనందరికీ ముఖ్యమని అతను చెప్పాడు. సహాయనిధికి ఇచ్చిన డబ్బు మాత్రమే కాకుండా ఇతర రూపాల్లో కూడా సహాయక కార్యక్రమాల్లో సచిన్ పాలపంచుకుంటున్నాడు' అని అతను సన్నిహితుడొకరు వెల్లడించారు. ఇక కరోనా కట్టడికి సచిన్ తన వంతు సాయంగా రూ.50 లక్షల విరాళాన్ని అందజేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో 5 వేల కుటుంబాలకు నెలకు సరిపడే సరకులను అందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications