Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇక మా అభిమానుల కోసం ఆడుతాం: హార్దిక్ పాండ్యా

తమ అభిమానుల కోసం మ్యాచ్‌లు గెలిచే ప్రయత్నం చేస్తామని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. ప్రస్తుతం తమ జట్టు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుందని, ప్రొఫెషనల్ క్రికెటర్లుగా ఈ సవాల్‌ను ఎదుర్కొంటామని చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో పేలవ ప్రదర్శనతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్.. చెన్నై సూపర్ కింగ్స్‌తో చావో రేవో మ్యాచ్ ఆడుతోంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో తమ బ్యాటర్లు అద్భుతంగా రాణించారని, దాంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేయబోతున్నాం. ఇది మంచి ట్రాక్‌లాగా కనిపిస్తోంది. ప్రపంచకప్ సమయంలో మేం జింబాబ్వేతో ఇక్కడ ఆడినప్పుడు పిచ్ చాలా బాగా సహకరించింది.

మా డ్రెస్సింగ్ రూమ్ బాగానే ఉంది..

గత మ్యాచ్‌లో మేం బ్యాటింగ్ చేసిన విధానాన్ని బట్టి.. బ్యాటర్లకు వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడానికి మరో అవకాశం ఇవ్వాలని అనుకున్నాం. ఈ టోర్నీలో నిలవాలంటే ప్రతీ మ్యాచ్‌ గెలవాలి. గత 8 మ్యాచ్‌లుగా పరిస్థితి ఇలాగే ఉంది. ఇప్పుడు ఇంకా క్లిష్టంగా మారింది. మేం మైదానంలోకి దిగి అత్యుత్తమ క్రికెట్ ఆడి.. ఏం జరుగుతుందో చూడాలి.

Playing for Pride and Points Hardik Pandya Bold Stance as MI Opts to Bat Against CSK
Photo Credit: screen grab for JioHotstar

మా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం బాగుంది. మేం ప్రొఫెషనల్స్. మేం మంచి క్రికెట్ ఆడాలి. ప్రతి సవాల్‌కు సిద్ధంగా ఉండాలి. కాబట్టి మా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం బాగుంది. ఇది సవాలుతో కూడుకున్నదే. కానీ మీరు చెప్పినట్లు మాకు ఇంకా ఆరు మ్యాచ్‌లు ఉన్నాయి. క్వాలిఫై అవ్వడానికి మాకు ఉన్న అత్యుత్తమ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదే సమయంలో ఇది ఆత్మగౌరవం కోసం ఆడుతున్న మ్యాచ్ కూడా. గెలవడం కోసమే క్రీడలు ఆడతాం. కాబట్టి గెలవడానికి సంబంధించిన విషయాలనే మేం మాట్లాడుకున్నాం.

రెండు మార్పులతో ఆడుతున్నాం..

జట్టుగా సమష్టిగా రాణించడంపై మేం ఫోకస్ పెట్టాలి. మేం ఓడిపోయిన మ్యాచ్‌ల్లో మొత్తం 40 ఓవర్ల పాటు చెత్తగా ఆడలేదు. కేవలం 2-3 ఓవర్ల కీలక సమయాల్లో చేసిన తప్పుల వల్లే మ్యాచ్‌లు చేజారాయి. ఆ కీలక క్షణాలను మా వైపు తిప్పుకోలేకపోయాం. అదే మా ఓటమికి కారణమైంది. కాబట్టి ఈ రోజు అందరం కలిసికట్టుగా రాణించి, చిన్న చిన్న అవకాశాలను కూడా వదలకుండా వీలైనన్ని ఎక్కువ పరుగులు చేస్తే బాగుంటుంది.

మా జట్టులో ఒకరు అరంగేట్రం చేస్తున్నారు. లెగ్ స్పిన్నర్ రఘు శర్మ ముంబై ఇండియన్స్ తరపున తన తొలి మ్యాచ్ ఆడుతున్నాడు. అలాగే అశ్విని స్థానంలో క్రిష్ భగత్ జట్టులోకి వచ్చాడు.'అని హార్దిక్ పాండ్యా తెలిపాడు.

బేసిక్స్‌కు తగ్గట్లు ఆడాలి..

మరోవైపు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలనుకున్నానని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతరాజ్ గైక్వాడ్ తెలిపాడు. పిచ్ పొడిగా ఉందని బౌలింగ్ చేయడం కూడా కలిసొచ్చే అంశమన్నాడు. గత మ్యాచ్‌లో క్లిష్ట పరిస్థితుల నుండి కోలుకుని మంచి స్కోరు సాధించామని, బౌలర్లు కూడా రాణించారని గుర్తుచేశాడు.

జట్టు సభ్యులకు తన సలహా ఏంటని అడగ్గా.. ఒత్తిడిలో ఉన్నప్పుడు అనవసర విషయాల గురించి ఆలోచించకుండా, కేవలం ప్రాథమిక అంశాలపై, ఆడే విధానంపై దృష్టి పెడితే ఫలితం దానంతట అదే వస్తుందని చెప్పానని వెల్లడించాడు. ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్ అని చెబుతూనే, జట్టులో రెండు మార్పులు చేశామని, రామకృష్ణ ఘోష్, ప్రశాంత్ వీర్ బరిలోకి దిగుతున్నారని చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, May 2, 2026, 20:47 [IST]
Other articles published on May 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+