Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: తొలి సెంచరీ చేసినోడిదే ప్రపంచకప్.. ఇదిగో సాక్ష్యం!

హైదరాబాద్: న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే జాక్‌పాట్ కొట్టేసాడు. వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభ మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగిన కాన్వే.. కాలం కలిసొస్తే జట్టును విజేతగా నిలబెటనున్నాడు. గతేడాది తృటిలో చేజారిన టైటిల్‌ను తన సెంచరీ సెంటిమెంట్‌తో అందివ్వనున్నాడు.

బౌండరీ లెక్క అనే అసంబద్దమైన నిబంధనతో అడ్డదారిలో టైటిల్ చేజిక్కించుకున్న ఇంగ్లండ్‌తో గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో శతక్కొట్టిన కాన్వే(121 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్స్‌లతో 152 నాటౌట్) న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

 Devon Conway recorded a century

ఈ మ్యాచ్‌లో 83 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్న కాన్వే.. వన్డే ప్రపంచకప్ 2023లో తొలి సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. కాన్వే తొలి సెంచరీ నమోదు చేయడంతో ఈసారి న్యూజిలాండ్ విజేతగా నిలుస్తుందనే వాదన తెరపైకి వచ్చింది. గత నాలుగు ప్రపంచకప్‌ల్లో తొలి సెంచరీ చేసిన ఆటగాడి జట్టే ప్రపంచకప్ గెలిచిందంట.

ఈసారి కాన్వే తొలి సెంచరీ చేయడంతో న్యూజిలాండ్ విజేతగా నిలుస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 2007 వన్డే ప్రపంచకప్ నుంచి ఈ సెంటిమెంట్ కొనసాగుతోందని, గత ప్రపంచకప్‌లో కూడా ఇది రిపీట్ అయిందని ఫ్యాన్స్ లెక్కలతో సహా వివరిస్తున్నారు.

2007 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ సెంచరీ చేయగా.. ఆ టోర్నీలో ఆ జట్టు విజేతగా నిలిచింది. ఆ టోర్నీలో స్కాట్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రికీ పాంటింగ్ 93 బంతుల్లో 113 పరుగులు చేసి తొలి సెంచరీ నమోదు చేశాడు.

2011 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తొలి శతకం నమోదు చేయగా.. ధోనీ సారథ్యంలోని భారత్ టైటిల్ కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సెహ్వాగ్ 175 పరుగులతో చెలరేగాడు.

2015 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ ఆరోన్ ఫించ్‌ తొలి సెంచరీ నమోదు చేయగా.. ఆ ఏడాది ఆ జట్టే విజేతగా నిలిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఫించ్ 135 పరుగులు చేశాడు.

2019 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జోరూట్ తొలి సెంచరీ నమోదు చేయగా.. ఆ జట్టే ఛాంపియన్‌గా నిలిచింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జోరూట్ శతక్కొట్టాడు.

తాజా 2023 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే శతక్కొట్టడంతో ఆ జట్టే టైటిల్ అందుకుంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Story first published: Thursday, October 5, 2023, 23:26 [IST]
Other articles published on Oct 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+