AB de Villiers భారత పౌరసత్వం తీసుకోని టీమిండియాకు ఆడు.. పంత్‌ను పక్కకు పెట్టేద్దాం!

హైదరాబాద్: టీ20 వరల్డ్‌కప్ ముందు సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకొంటాడనే ఊహాగానాలకు క్రికెట్ సౌతాఫ్రికా (సీఏ) తెరదించింది. అతను అంతర్జాతీయ క్రికెట్‌లోకి మళ్లీ అడుగుపెట్టబోడని ప్రకటించింది. 'డివిలియర్స్‌తో చర్చలు ముగిశాయి. అతనికి రిటైర్మెంట్‌పై మరో ఆలోచన లేదన్నాడు' అని వెస్టిండీస్ టూర్‌కు జట్టు ప్రకటన సందర్భంగా క్రికెట్ సౌతాఫ్రికా తెలిపింది.
ఈ ప్రకటనతో ఏబీడీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా భారత అభిమానులు అతన్ని భారత పౌరసత్వం తీసుకొని టీమిండియాకు ఆడాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. దాంతో ఏబీడీ ట్యాగ్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

2018లో అనూహ్యంగా..
34 ఏళ్ల వయసులో, మంచి ఫామ్‌లో ఉండగానే ఏబీడీ.. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి అభిమానులను తీవ్ర నిరాశలో ముంచెత్తాడు. తనలో ఇంకా ఎంతో ఆట ఉన్నప్పటికీ.. అప్పటి క్రికెట్ దక్షిణాఫ్రికా పెద్దలు తన నిబద్ధతను శంకించడంతో మనస్తాపానికి గురై ఏబీ అంతర్జాతీయ క్రికెట్‌కు టాటా చెప్పినట్లుగా వార్తలొచ్చాయి.
2019 వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా పేలవ ప్రదర్శన చేయడంతో ఏబీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి రావాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. కోచ్ మార్క్ బౌచర్.. ఏబీని మళ్లీ దక్షిణాఫ్రికా జట్టులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది. ఏబీ కూడా ఇటీవల టీ20 ప్రపంచకప్ ఆడే దిశగా సానుకూల సంకేతాలు ఇచ్చాడు. కానీ ఇప్పుడేమో సీఎస్‌ఏ అనూహ్యంగా ఈ చర్చకు తెరదించేసింది.

దుమ్మురేపిన ఏబీడీ..
ఐపీఎల్ 2021 సీజన్‌లో ఏబీడీ దుమ్మురేపాడు. ఆడిన ఆరు ఇన్నింగ్స్‌ల్లో 164.28 స్ట్రైక్‌రేట్‌తో 207 పరుగులు చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో నెం.4, నెం.5 స్థానాల్లో వచ్చి పరుగుల వరద పారించాడు. ఐపీఎల్ 2021 ప్రదర్శనతో ఏబీ డివిలియర్స్ టీ20 ప్రపంచకప్ ఆడడం ఖాయమే అనుకున్నారంతా. కానీ ఐపీఎల్ 2021 అర్ధంతరంగా రద్దు కావడంతో స్వదేశానికి వెళ్లిన ఏబీడిని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు సంప్రదించినప్పటికీ.. తన నిర్ణయంలో ఏ మార్పు లేదని, ఉండదని తేల్చేశాడు.
హెడ్ కోచ్ మార్క్ బౌచర్ చర్చలు జరిగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో అతనిపైనే గంపెడాశలు పెట్టుకున్న సౌతాఫ్రికా క్రికెట్ బోర్డులో నైరాశ్యం ఆవహించింది. ఇక ఫాన్స్ అయితే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఏబీడీ భారత జట్టుకు ఆడు..
ఏబీడీ.. భారత జట్టుకు ఆడని ఇండియన్ ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా కోరుతున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆశించిన స్థాయిలో రాణించడంలేదని, అతని స్థానంలో ఆడమని ఓ యూజర్ విజ్ఞప్తి చేశాడు. దయచేసి ఇండియాకు ఆడండి ఏబీడీ.. అని మరొక అభిమాని కోరారు. మరికొంతమంది ఫన్నీ మీమ్స్, కామెంట్స్ చేస్తున్నారు. ఏబీడీ నిర్ణయంతో బౌలర్లంతా ఊపిరి పీల్చుకున్నారని కామెంట్ చేస్తున్నారు. ప్రత్యర్థి దేశాలన్నీ పండుగ చేసుకుంటాయనే మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. సౌతాఫ్రికాలో కంటే భారత్‌లోనే ఏబీడీ అభిమానులు ఎక్కువగా ఉన్నారని పేర్కొంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications