పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ స్టార్ ఆటగాడి కంటే.. ప్రొ కబడ్డీ ప్లేయర్‌కే అత్యధిక ధర! పీఎస్‌ఎల్ మరీ ఇంత చీపా!!

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ వచ్చినప్పటినుంచి టీ20 క్రికెట్‌కు భారీ ఆదరణ పెరిగింది. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచే సక్సెస్ అవ్వడంతో.. ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. ఐపీఎల్ టోర్నీని చూసి పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్), బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్), అఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ లాంటి ఎన్నో టోర్నీలు పుట్టుకొచ్చాయి. అయితే ఐపీఎల్ మాదిరిగా పీఎస్‌ఎల్, బీబీఎల్, సీపీఎల్ టోర్నీలు విజయవంతం కాలేదు. అంతేకాకుండా ఆటగాళ్లకు కూడా ఐపీఎల్ టోర్నీలో వచ్చేంత ధర మిగతా లీగుల్లో ఉండదు. ఐపీఎల్ టోర్నీలో ఓ సాధారణ ఆటగాడికి ఉండే ధర.. మిగతా టోర్నీల్లో స్టార్ ప్లేయర్‌కు ఉండదు.

అంచెలంచెలుగా ఎదుగుతూ
భారత సంప్రదాయ క్రీడ అయిన కబడ్డీ కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాదిరే అంచెలంచెలుగా ఎదుగుతోంది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) మొదటి సీజన్ ప్రేక్షకాదరణ పొందకపోయినా.. 2-3 సీజన్ల నుంచి దుమ్మురేపుతోంది. రైడింగ్, టాక్లింగ్‌లలో ఆటగాళ్లు సత్తాచాటారు. పీకేఎల్ మూడు నెలల పాటు అభిమానులను అలరిస్తూ వస్తుంది. రసవత్తర మ్యాచులు జరగడంతో ఫాన్స్ మైదానంలకు క్యూ కడుతూ.. టీవీలకు అతుక్కుపోయారు. ఐపీఎల్ టోర్నీకి సమానంగా పీకేఎల్‌ను ఆదరిస్తున్నారు. దీంతో ఆటగాళ్ల ధర కూడా భారీగా పెరిపోయింది. ఎంతలా అంటే.. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో ఆడే స్టార్ ఆటగాడిని ధరను మించిపోయింది.

మరీ ఇంత చీపా
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్-8 సమరానికి సమయం దగ్గరపడుతోంది. ఏఈ క్రమంలో పీకేఎల్ 2021 కోసం మూడు రోజుల పాటు (ఆదివారం, సోమవారం, మంగళవారం) వేలం జరిగింది. స్టార్ రైడర్, డుబ్కీ కింగ్ పర్‌దీప్ నర్వాల్.. పీకేఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. యూపీ యోధ జట్టు వేలంలో అతణ్ని రికార్డు స్థాయిలో రూ 1.65 కోట్లకు సొంతం చేసుకుంది.
దీంతో లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా పర్‌దీప్ నర్వాల్ రికార్డు సృష్టించాడు. పర్‌దీప్ ధర పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) 2021 వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఉన్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కంటే ఎక్కువగా ఉండడం విశేషం. 2021 కోసం కరాచీ కింగ్స్ ఆజమ్‌కు రూ 1.09 కోట్లు చెల్లించింది. దీంతో పీఎస్‌ఎల్ మరీ ఇంత చీపా అని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
IPL 2021: విండీస్ హిట్టర్‌ను దక్కించుకున్న రాజస్తాన్.. ఇక పరుగుల వరదే!!

పర్‌దీప్ నర్వాల్‌కు రూ 1.65 కోట్లు
పీకేఎల్-8 ద్వారా తొలిసారి వేలానికి వచ్చిన డుబ్కీ కింగ్, స్టార్ రైడర్ పర్‌దీప్ నర్వాల్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. యూపీ యోధ అతడి కనీస ధర రూ. 30 లక్షలకు ఐదు రెట్లుపైగా వెచ్చించి మరీ సొంతంచేసుకుంది. రైడర్ సిద్ధార్థ్ దేశాయ్‌ను రూ. 1.30 కోట్లకు తెలుగు టైటాన్స్ అట్టిపెట్టుకుంది.
మంజీత్‌ను రూ.92 లక్షలకు తమిళ తలైవాస్ చేజిక్కించుకుంది. సచిన్ (రూ.84 లక్షలు)ను పట్నా పైరేట్స్, రోహిత్ గులియా (రూ.83 లక్షలు)ను హరియాణా స్టీలర్స్, సుర్జీత్ సింగ్ (రూ.75 లక్షలు)ను తమిళ్ తలైవాస్, రవిందర్ పాహల్ (రూ.74 లక్షలు)ను గుజరాత్ జెయింట్స్, ఆల్‌రౌండర్ దీపక్ నివాస్ హుడాను రూ. 55 లక్షలకు జైపూర్ పింక్ పాంథర్స్, విశాల్ భరద్వాజ్‌ను రూ. 60 లక్షలకు పుణెరి పల్టన్, సందీప్ కుమార్ ధుల్‌ను రూ. 50 లక్షలను జైపూర్ పింక్ పాంథర్స్ కొనుగోలు చేశాయి.

ఆజమ్‌కు రూ 1.09 కోట్లు
మరోవైపు పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) 2021 కోసం జరిగిన వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడు బాబర్ ఆజమ్. కరాచీ కింగ్స్ ఆజమ్‌కు రూ 1.09 కోట్లు చెల్లించింది. షాదాబ్ ఖాన్, రషీద్ ఖాన్, క్రిస్ లిన్, టామ్ బంటన్, అసన్ అలీ, డేవిడ్ వార్నర్, మొహమ్మద్ అమిర్, క్రిస్ గేల్, మిల్లర్, హఫీజ్, ఆఫ్రిది, సర్ఫరాజ్, మాలిక్, మున్రో లాంటి స్టార్ ఆటగాళ్లకు సైతం తక్కువ ధరే ఉంది. అందరూ ఇంచుమించు ఒక కోటి వరకు పారితోషకం అందుకోనున్నారు.
పీఎస్ఎల్ ప్రారంభమైన నాటి నుంచి ప్రతి విషయంలో ఈ లీగ్‌ను ఐపీఎల్‌తో పోల్చుతున్నారు. అయితే ప్రపంచంలోనే బలమైన క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ కనుసన్నల్లో నడుస్తోన్న ఐపీఎల్‌లో ప్రైజ్ మనీ, ఆటగాళ్లకు ఇచ్చే వేతనాలు, స్పాన్సర్ల ద్వారా వచ్చే ఆదాయం భారీ మొత్తంలో ఉంటుంది. పీఎస్‌ఎల్‌లో మాత్రం ఇలా ఉండదు. పీఎస్‌ఎల్ మాత్రమే కాదు ఏటా జరిగే ఏ లీగ్‌లలో అయినా ప్రైజ్ మనీ విషయంలో ఐపీఎల్‌తో పోటీ పడలేవు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications