Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: ఆస్ట్రేలియా విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం!

మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా భారత్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 339 పరుగుల భారీ లక్ష్యం నమోదు చేసింది. ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (93 బంతుల్లో 17 ఫఫోర్లు, 3 సిక్స్‌లతో 119) విధ్వంసకర శతకంతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది.

ఎల్లిస్ పెర్రీ(88 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77), అష్లే గార్డ్‌నర్(45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో శ్రీ చరణి(2/49), దీప్తి శర్మ రెండేసి వికెట్లు తీయగా.. క్రాంతి గౌడ్, అమన్‌జోత్ కౌర్, రాధ యాదవ్ చెరో వికెట్ తీసారు.

శతక్కొట్టిన లిచ్ ఫీల్డ్..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఆశించిన శుభారంభం దక్కలేదు. ఓపెనర్ కమ్ కెప్టెన్ అలీసా హీలీ(5)ని క్రాంతి గౌడ్ క్లీన్ బౌల్డ్ చేసింది. క్రీజులోకి వచ్చిన ఎల్లిస్ పెర్రీతో కలిసి ఫోబే లిచ్ ఫీల్డ్ చెలరేగింది. ఈ జోడీ దూకుడుగా ఆడటంతో పవర్ ప్లేలోనే ఆసీస్ వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది. అనంతరం మరింత సాధికారికంగా బ్యాటింగ్ చేసిన ఈ జోడీ భారత బౌలర్లను చెడుగుడు ఆడింది. ఈ క్రమంలో 45 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న లిచ్ ఫీల్డ్.. మరో 32 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకుంది.

Phoebe Litchfield Slams Century as Australia Set Big Target for India in Women s World Cup 2025 Semi-Final

లిచ్ ఫీల్డ్ విధ్వంసం ముందు భారత బౌలర్లు తేలిపోయారు. లిచ్ ఫీల్డ్ భారీ ఇన్నింగ్స్ అమన్ జోత్ కౌర్ తెరదించింది. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 155 పరుగులు భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులో బెత్ మూనీ రాగా.. ఎల్లిస్ పెర్రీ 66 బంతుల్లో అర్థ శతకం సాధించింది. బెత్ మూనీ(24), అన్నబెల్ సదర్లాండ్(3)ను శ్రీ చరణి తన వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చింది. క్రీజులోకి అష్లే గార్డనర్ రాగా.. ఎల్లిస్ పెర్రీ సెంచరీ దిశగా సాగింది. కానీ ఆమెను రాధా యాదవ్ క్లీన్ బౌల్డ్ చేసింది.

చివర్లో కట్టడి చేసిన బౌలర్లు..

తహిలా మెక్‌గ్రాత్(12) విఫలమైనా.. అష్లే గార్డనర్ జట్టు స్కోర్‌ను 300 మార్క్ ధాటించింది. కాంత్రి గౌడ్ అద్భుత త్రో ఆమె రనౌట్ కగా.. తమిళా మెక్ గ్రాత్‌ను జెమీమా రనౌట్ చేసింది. సోఫీ మోలినక్స్(0)ను దీప్తి శర్మ క్లీన్ బౌల్డ్ చేయగా.. కిమ్ గార్త్‌ను అమన్ జోత్ కౌర్ రనౌట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. చివర్లో భారత బౌలర్లు, ఫీల్డర్లు సత్తా చాటడంతో ఆసీస్ భారీ స్కోర్‌కు అడ్డుకట్టపడింది.

Story first published: Thursday, October 30, 2025, 19:45 [IST]
Other articles published on Oct 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+