రెండో టెస్టు ఓటమితో చెత్త రికార్డు మూటగట్టుకున్న కోహ్లీ

పెర్త్: ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన తొలి టెస్టులోనే విజయం సాధించి అరుదైన రికార్డు సొంతం చేసుకున్న టీమిండియా.. ఆ తర్వాత జరిగిన రెండో టెస్టులోనే ఘోర పరాజయంతో మరో చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. తొలి టెస్టులో 31 పరుగుల తేడాతో టీమిండియా విజేతగా నిలిచి సిరీస్‌ను ఆధిక్యంతో ఆరంభించింది. కానీ, రెండో టెస్టులో మాత్రం 146 పరుగులతో దారుణంగా ఓడిపోయింది. ఆసీస్ నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 140పరుగులకే కుప్పకూలింది.
మంగళవారం ఉదయం 112/5 ఓవర్‌నైట్ స్కోరుతో చివరిరోజు బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా కేవలం 28 పరుగులు మాత్రమే జోడించింది. హనుమ విహారి-పంత్ జోడీ కాసేపు క్రీజులో నిలబడినా పరుగులు మాత్రం రాలేదు. వీరిద్దరి జోడీ పెవిలియన్ చేరిన తర్వాత టెయిలెండర్లు యథావిధిగా ఏమాత్రం ఆకట్టుకోకుండానే పెవిలియన్ చేరారు.

తొలి టెస్టు 31తో హిట్.. రెండో టెస్టు 146తో ఫట్
ఉమేశ్‌యాదవ్ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఇషాంత్, బుమ్రా డకౌట్‌గా వెనుదిరగటంతో టీమిండియా 140 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 3, నాథన్ 3, హేజిల్‌వుడ్ 2, కమిన్స్ 2 వికెట్లు తీసుకున్నారు. శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకి ఆలౌటవగా.. భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకే చేతులెత్తేసింది.
పెర్త్ వేదికగా గొడవకు దిగిన ఇషాంత్.. జడేజాలు(వీడియో)

బ్యాటింగ్‌లోపంతోనే మ్యాచ్ వైఫల్యానికి కారణం
దీంతో.. 43 పరుగుల ఆధిక్యాన్ని అందుకున్న ఆస్ట్రేలియా జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 243 పరుగులకి ఆలౌటై.. భారత్‌కి 287 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. చేధనకు దిగిన టీమిండియా నాలుగు, ఐదు రోజుల ఆటలో పేలవ ప్రదర్శన చూపించడంతో ఘోర పరాజయానికి గురి కావాల్సి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీనే ఒప్పుకున్నాడు. బ్యాటింగ్ ఇంకాస్త మెరుగ్గా చేసి ఉంటే బాగుండేదని మీడియా ముందు వెల్లడించాడు.

చెత్త రికార్డు మూటగట్టుకున్న కోహ్లీ
ఈ ఓటమితో టీమిండియా లెజెండరీ కెప్టెన్ ఎంఏకే పటౌడీ పేరిట మాత్రమే ఇన్నాళ్లూ ఉన్న ఓ చెత్త రికార్డును కోహ్లి సొంతం చేసుకున్నాడు. కోహ్లి కెప్టెన్సీలో నాలుగో ఇన్నింగ్స్‌లో టార్గెట్ చేస్తూ టీమ్ ఓడిపోవడం ఇది తొమ్మిదోసారి. గతంలో పటౌడీ కెప్టెన్సీలోనే ఈ రికార్డు ఉండగా.. ఇప్పుడు కోహ్లి కూడా అతని సరసన నిలిచాడు. అంతేకాదు విదేశాల్లో ఈ ఏడాది టీమిండియాకు ఇది ఏడో ఓటమి. గతంలో 2014లో ఆరు ఓటములతో ఉన్న రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.

తొలి టెస్టు విజయాన్ని అందుకున్న టిమ్ పైన్
మరోవైపు కోహ్లి చెత్త రికార్డు మూటగట్టుకున్న ఈ టెస్ట్‌లోనే ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పేన్ మాత్రం తన తొలి టెస్ట్ విజయాన్ని అందుకోవడం విశేషం. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా ఉండగా.. మూడో టెస్ట్ ఈ నెల 26 నుంచి మెల్‌బోర్న్‌లో జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications