ఆస్ట్రేలియా పర్యటనకు డుమ్మా.. హారిస్ రౌఫ్‌పై పీసీబీ కఠిన చర్యలు!
పాకిస్థాన్ స్టార్ పేసర్ హారిస్ రౌఫ్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు పీసీబీ కఠిన చర్యలు తీసుకుంది. అతని సెంట్రల్ కాంట్రాక్టును రద్దు చేసింది. గతేడాది ఆస్ట్రేలియా పర్యటన నుంచి ఉద్దేశ పూర్వకంగా తప్పుకోవడంతో ఈ చర్యలు తీసుకుంది.
గతేడాది ఆస్ట్రేలియా పర్యటన నుంచి చివరి నిమిషంలో హారిస్ రౌఫ్ తప్పుకున్నాడు. అతను ఎలాంటి ఫిట్‌నెస్ సమస్యలు లేకపోయినా.. ఉద్దేశపూర్వకంగానే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లలేదు. ఆ సమయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మెడికల్ టీమ్.. హరీస్ రౌఫ్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడని బోర్డుకు నివేదిక ఇచ్చింది.

ఈ వ్యవహారంపై హారీస్ రౌఫ్ ఇచ్చిన వివరణపై పీసీబీ సంతృప్తి చెందలేదు. ఉద్దేశపూర్వకంగానే ఆస్ట్రేలియా పర్యటనకు దూరంగా ఉన్నాడని హారీస్ రౌఫ్ కాంట్రాక్టును రద్దు చేయడంతో పాటు జూన్ 30 వరకు ఎలాంటి విదేశీ టీ20 లీగ్స్ ఆడకుండా నిషేధం విధించింది.
'పాకిస్థాన్ జట్టు తరఫున ఆడటమే ఎంతటి ఆటగాడికైనా గౌరవం. పాకిస్థాన్ టెస్ట్ టీమ్ నుంచి ఉద్దేశపూర్వకంగా తప్పుకోవడంతో పాటు సరైన వివరణ ఇవ్వకపోవడం సెంట్రల్ కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించడమే.'అని పీసీబీ తమ ప్రకటనలో పేర్కొంది. ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్థాన్ దారుణంగా విఫలమైంది. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 0-3తో చిత్తయిన పాకిస్థాన్.. టీ20 సిరీస్‌ను 1-4తో కోల్పోయింది.
పాకిస్థాన్ టీమ్ డైరెక్టర్ మాజీ క్రికెట్ మహమ్మద్ హఫీజ్‌ను నియమించింది. ఇన్నాళ్లు డైరెక్టర్‌గా సేవలందించిన మిక్కీ ఆర్థర్ స్థానాన్ని మహమ్మద్ హఫీజ్‌తో భర్తీ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications