Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండు క్యాచ్‌లు వదిలేసా కోచ్ పదవి ఇచ్చేస్తారా! పాక్‌పై సెటైర్లు!

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మరోసారి నవ్వులపాలైంది. ఫీల్డింగ్ కోచ్ కావాలంటూ లింక్డ్‌ఇన్‌లో హైరింగ్ పోస్ట్ పెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. మొన్నటి వరకు ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్న షేన్ మెక్‌డెర్మాట్ పదవీకాలం జులైలో ముగిసింది. ప్రస్తుతం ఆ పదవి ఖాళీగా ఉండటంతో.. పీసీబీ దరఖాస్తులను ఆహ్వానించింది.

అయితే ఇందుకోసం పీసీబీ ఎంచుకున్న విధానం విమర్శలకు దారి తీసింది. ఇప్పటికే ఇంగ్లండ్ పర్యటనలో పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. తాజా పనితో మరింత నవ్వుల పాలైంది. పీసీబీ ఎంచుకున్న విధానాన్ని నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు. తమదైన శైలిలో విమర్శలు, సెటైర్లతో ఆడుకుంటున్నారు.

ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్‌కు ఘోర అవమానం.. తోక ముడిచిన బాబర్ సేన!

ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్‌కు ఘోర అవమానం.. తోక ముడిచిన బాబర్ సేన!

పతార, పైరవీలు పనిచేయవా?

' రెండు క్యాచ్‌లు వదిలేసా.. కోచ్ పదవి ఇచ్చేస్తారా?'అని ఒకరంటే.. పీసీబీ ప్రతిభ ఆధారంగా కోచ్‌లను ఎంపిక చేస్తుందా? ఆశ్చర్యంగా ఉందని మరో నెటిజన్ సెటైర్ పేల్చాడు. ఈ కోచ్ పదవికి పతార, పైరవీలు పనిచేయవా? అని మరో నెటిజన్ వ్యంగ్యంగా ప్రశ్నించాడు. ఈ పదవి కోసం రిటైర్డ్ మిలిటరీ, ఆర్మీ సిబ్బందిని సంప్రదించండని మరో యూజర్ సెటైర్ వేసాడు. ఇండస్ట్రియల్ ఆటోమేషన్ రంగంలో పనిచేసిన అనుభవం ఉందని, కోచ్ పదవికి ఎంపిక చేస్తారా? అని మరో నెటిజన్ అడిగాడు.

PCB Faces Brutal Trolling After Advertising Pakistan Head Coach Vacancy on LinkedIn

ఏడుగురిపై వేటు..

మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కోల్పోయింది. ఈ వైఫల్యాన్ని తీవ్రంగా పరిగణించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కఠిన చర్యలు తీసుకుంది. హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌తో పాటు ఏడుగురు ఆటగాళ్లపై వేటు వేసింది.

మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ ఆఘా, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, మహమ్మద్ అవైస్ జఫర్, ఖుర్రమ్ షహ్‌జాద్ ఈ జాబితాలో ఉన్నారు. వారి స్థానాల్లో సైమ్ అయూబ్, అబ్దుల్లా ఫజల్, అరాఫత్ మిన్హాస్ తదితరులు జట్టులోకి వచ్చారు. అదే సమయంలో టెస్ట్ టీమ్ హెడ్ కోచ్‌గా మైక్ హెస్సెన్, బౌలింగ్ కోచ్‌గా యాష్లే నోఫ్‌కేలను నియమించారు.

ENG vs PAK: ఒరేయ్ ఆజామూ.. ఏమీరా నీ వల్ల ఉపయోగం!

Also Read

ENG vs PAK: ఒరేయ్ ఆజామూ.. ఏమీరా నీ వల్ల ఉపయోగం!

ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో ఓడిన పాకిస్థాన్.. రెండో టెస్ట్‌లో 194 పరుగుల తేడాతో చిత్తయ్యింది. మూడో టెస్ట్ బర్మింగ్‌హామ్ వేదికగా సెప్టెంబర్ 9-13 మధ్య జరగనుంది. 2018 నుంచి సెనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో పాకిస్థాన్ టెస్ట్‌ల్లో విజయం సాధించలేదు.

Story first published: Wednesday, September 2, 2026, 19:50 [IST]
Other articles published on Sep 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+