IPL 2026 ఫైనల్‌కు పాక్ చీఫ్!
ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ మోహ్‌సిన్ నఖ్వీ హాజరవుతాడా? అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది. అప్‌కమింగ్ ఐసీసీ క్వార్టర్ సమావేశాలు భారత్ వేదికగా జరగనున్నాయి. మే 21న చీఫ్ ఎగ్గిక్యూటివ్స్ కమిటీ సమావేశాన్ని వర్చువల్‌గా నిర్వహించనుండగా.. మే 30-31 తేదీల్లోఐసీసీ బోర్డు ప్రత్యక్ష సమావేశాలు అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి.
అయితే ఐపీఎల్ 2026 ఫైనల్ కూడా మే 31న అహ్మదాబాద్ వేదికగానే జరగనుంది. దాంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ అయిన మోహ్‌సిన్ నఖ్వీ హాజరవుతాడా? లేక ఈ సమావేశాల బహిష్కరిస్తాడా? అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జోరుగా సాగుతోంది.

వాస్తవానికి ఐసీసీ క్వార్టర్ సమావేశాలను మార్చి-ఏప్రిల్ దోహలో నిర్వహించాల్సింది. కానీ పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం కారణంగా వేదికను మార్చారు. మరోవైపు ఐపీఎల్ ఫైనల్‌కు హాజరు కావాల్సిందిగా మోహ్‌సిన్ నఖ్వీకి అధికారిక ఆహ్వానం అందిందని పాకిస్థాన్ మీడియాలో వార్తలొస్తున్నాయి.
మోహ్‌సిన్ నఖ్వీ పీసీబీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్‌తో సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ముఖ్యంగా ఆసియా కప్ విజేతగా నిలిచిన టీమిండియాకు ట్రోఫీ ఇవ్వకుండా నఖ్వీ ఎత్తుకెళ్లాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్‌గా ఉన్న అతని చేతుల మీదుగా టైటిల్ అందుకునేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. దాంతో తానే టైటిల్ అందిస్తానని పట్టుబట్టి తన వెంట తీసుకెళ్లాడు.
అతని చర్యపై బీసీసీఐ ఆగ్రహంగా ఉంది. ఇప్పటికీ ఆసియా కప్ ట్రోఫీ భారత్‌కు ఇవ్వలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో అహ్మదాబాద్ వేదికగా జరిగే ఐసీసీ మీటింగ్‌కు హాజరయ్యేందుకు నఖ్వీ.. పాకిస్థాన్ ప్రభుత్వం అనుమతి కోరుతాడా? లేక ప్రత్యామ్నాయంగా వర్చువల్‌గా సమావేశంలో పాల్గొంటాడా? అనే విషయంపై క్లారిటీ లేదు. నఖ్వీ వర్చువల్‌గానే పాల్గొనే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications