న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PBKS vs SRH: మనీష్ పాండే, ముజీబ్‌లపై వేటు.. కేన్ మామ, కేదార్ కాకకు చోటు.. పంజాబ్‌దే బ్యాటింగ్!

PBKS vs SRH: Punjab bat, Kedar and Williamson play for Sunrisers

చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. లక్ష్యచేధనలో తడబడుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను పంజాబ్ మరోసారి చేజింగ్‌కు ఆహ్వానించింది. గత మూడు మ్యాచ్‌‌ల్లో కూడా హైదరాబాద్ చేజింగ్ చేయలేక చేతులెత్తేసిన విషయం తెలిసిందే. ఈ బలహీనతపైనే పంజాబ్ కింగ్స్ దెబ్బకొట్టాలని బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లలో మార్పులు చోటు చేసుకున్నాయి. అంతా ఊహించినట్లే సన్‌రైజర్స్ జట్టులోకి కేదార్ జాదవ్, కేన్ విలియమ్సన్ రాగా.. మనీష్ పాండే, ముజీబ్ ఉర్ రెహ్మాన్‌లకు ఉద్వాసన పలికారు. తొడ కండరాల గాయానికి గురైన అబ్దుల్ సమద్ స్థానంలో సిద్దార్థ్ కౌల్‌ అవకాశం దక్కించుకున్నాడు.

పంజాబ్ జట్టులో కూడా రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. జై రిచర్డన్ సన్, జలజ్ సక్సెనాలపై వేటు పడగా..హెన్రీక్స్, మురుగన్ అశ్విన్ జట్టులోకి వచ్చారు. కేన్ విలియమ్సన్‌ రాకతో జట్టు రాత మారుతుందని సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన సన్‌రైజర్స్‌కు ఈ సీజన్‌లో ఏదీ కలిసి రావడం లేదు. మిడిలార్డర్ బ్యాటింగ్ వైఫల్యం జట్టును చాలా దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌తో జరిగే ఈ పోరుతో గెలుపు బాట పట్టాలని సన్‌రైజర్స్ భావిస్తోంది. మరో పక్క టోర్నీని విజయంతో మొదలుపెట్టిన పంజాబ్.. గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. దీంతో సన్‌రైజర్స్‌కు షాకిచ్చి తిరిగి గాడిలో పడాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే చెన్నై వేదికగా సన్‌రైజర్స్ ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడగా.. పంజాబ్‌కు ఇదే ఫస్ట్ మ్యాచ్. ఇది ఆరెంజ్ ఆర్మీకి కలిసొచ్చే అంశం.

ఈ ధనాధన్ లీగ్‌లో ఇరు జట్లు ఇప్పటి వరకు 16 సార్లు తలపడగా 11 విజయాలతో సన్‌రైజర్స్ హైదరాబాదే పైచేయి సాధించింది. పంజాబ్ కేవలం 5 మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గింది. అయితే 2018 నుంచి ప్రతీ సీజన్‌లో ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలుస్తూ వస్తున్నాయి. పంజాబ్ జట్టుపై డేవిడ్ వార్నర్‌కు మంచి రికార్డుంది. అతను ఆ జట్టుపై ఇప్పటి వరకు 661 రన్స్ చేశాడు. గత సీజన్‌లో ఇరు జట్లు చెరొక విజయాన్నందుకున్నాయి. తొలి మ్యాచ్‌లో 69 పరుగుల భారీ తేడాతో సన్‌రైజర్స్ గెలవగా.. సెకండ్ మ్యాచ్‌లో పంజాబ్ 12 రన్స్‌తో విజయం సాధించింది.

తుది జట్లు:

సన్‌రైజర్స్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో(కీపర్), కేన్ విలియమ్సన్, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ, సిద్దార్థ్ కౌల్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్

పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్, కీపర్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, షారుఖ్ ఖాన్, హెన్రీక్స్, మహ్మద్ షమీ, మురుగన్ అశ్విన్, అర్ష్‌దీప్ సింగ్

Story first published: Wednesday, April 21, 2021, 15:31 [IST]
Other articles published on Apr 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X