ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పంజాబ్ కింగ్స్ సారథి శిఖర్ ధావన్ తెలిపాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఈ వికెట్ మ్యాచ్ ఆసాంతం ఒకేలా ఉండనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తాం. గత మ్యాచ్‌లో మేం లక్కీగా విజయం సాధించాం. మా జట్టు ఏ ఒక్క ఆటగాడిపైనో ఆధారపడకపోవడం బాగుంది.
మేం ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచాం. అదే జోరును కొనసాగించే ప్రయత్నం చేస్తాం. గాయం నుంచి లియామ్ లివింగ్ స్టోన్ ఇంకా కోలుకోలేదు. విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగిస్తున్నాం.'అని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ తీసుకునేవాళ్లమని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. ఈ సీజన్‌లో తమ ప్రదర్శన సంతృప్తికరంగా ఉందని, ఇప్పటికే రెండు విజయాలు సాధించామని చెప్పాడు. మరో మ్యాచ్‌లో కూడా తృటిలో విజయాన్ని చేజార్చుకున్నామని గుర్తు చేశాడు.
తమ జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉందని, బ్యాటింగ్‌లో డెప్త్ కూడా ఉందని చెప్పాడు. ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌తోనే బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. పవర్ ప్లే, డెత్ బౌలింగ్‌లో చాలా ఆప్షన్స్ ఉండటంతోనే తాను మిడిల్ ఓవర్లలో ఎక్కువగా బౌలింగ్ చేస్తున్నానని తెలిపాడు.
తుది జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీశ్ రెడ్డి, షెహ్‌బాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనాద్కత్, టీ నటరాజన్
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జితేశ్ శర్మ(కీపర్), అషుతోష్ శర్మ, సామ్ కరణ్, శశాంక్ సింగ్, సికందర్ రాజా, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడా, అర్ష్‌దీప్ సింగ్