Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs SRH మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. సన్‌రైజర్స్ గట్టెక్కించిన ఉనాద్కత్ సిక్సర్! (వీడియో)

ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్‌తో మంగళవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది.

తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినాన సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంతోషాన్ని పంచింది. ముఖ్యంగా తెలుగు తేజం నితీష్ రెడ్డి సంచలన ప్రదర్శన ప్రతీ తెలుగోడు గర్వపడేలా చేసింది.

PBKS vs SRH Match Turning Point

సంచలన బ్యాటింగ్‌తో నితీష్ రెడ్డి పోరాడే లక్ష్యాన్ని అందించినా.. జయదేవ్ ఉనాద్కత్ కొట్టిన సిక్సరే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. చివరి ఓవర్‌లో ఆఖరి బంతికి బ్యాటింగ్‌కు వచ్చిన ఉనాద్కత్.. భారీ సిక్సర్‌తో జట్టు స్కోర్‌ను 180 పరుగుల మార్క్‌ను ధాటించడమే కాకుండా.. మూమెంటమ్‌ను సన్‌రైజర్స్ వైపు తిప్పాడు.

ఈ 6 పరుగులే చివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను గట్టెక్కించాయి. ఆఖరి ఓవర్‌లో పంజాబ్ విజయానికి 29 పరుగులు అవసరమవ్వగా.. ఉనాద్కత్ బౌలింగ్‌లో అషుతోష్ శర్మ రెండు భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. ఈ రెండు సిక్స్‌లు కూడా బౌండరీ లైన్ వద్ద క్యాచ్‌లుగా రాగా.. సన్‌రైజర్స్ ప్లేయర్స్ వదిలేసారు.

దాంతో అతను ఒత్తిడికి గురై వైడ్ బాల్స్ వేసాడు. ఆఖరి బంతికి శశాంక్ సింగ్ భారీ సిక్సర్ బాదినా.. సన్‌రైజర్స్ 2 పరుగులతో గట్టెక్కింది. బ్యాటింగ్‌లో ఉనాద్కత్ సిక్సర్ కొట్టకపోయి ఉంటే మ్యాచ్‌ పంజాబ్ వశమయ్యేది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి(37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 64) హాఫ్ సెంచరీతో చెలరేగాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులే చేసి ఓటమిపాలైంది. శశాంక్ సింగ్(25 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 46 నాటౌట్), అషుతోష్ శర్మ(15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33 నాటౌట్) సంచలన బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్‌ను ఓడించినంత పని చేశారు.

Story first published: Wednesday, April 10, 2024, 0:20 [IST]
Other articles published on Apr 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+