అందుకే రెండు మార్పులు చేశాం: శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో రెండు మార్పులు చేశామని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. శశాంక్ సింగ్ స్థానంలో సూర్యాన్ష్ షెద్గే, జేవియర్ బార్ట్‌లెట్ స్థానంలో లాకీ ఫెర్గూసన్ బరిలోకి దిగుతున్నాడని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్‌కు దిగింది.
టాస్ సందర్భంగా మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నామని చెప్పాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. ఎందుకంటే గత రెండు రోజులుగా పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారని మా జట్టు సభ్యుడొకరు చెప్పారు. అయితే బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా ఒక గొప్ప సవాల్ అని నా అభిప్రాయం.

టాస్‌తో సంబంధం లేకుండా గెలవాలి..
టాస్‌తో సంబంధం లేకుండా మేమంతా చాలా ప్రోయాక్టివ్‌గా ఉంటాం. మా జట్టులో ఒక మార్పు తప్పనిసరిగా చేయాల్సి వచ్చింది. శశాంక్ స్థానంలో సూర్యాన్ష్ షేడ్జ్ వచ్చాడు. మరొక మార్పుగా జేవియర్ బార్ట్‌లెట్ స్థానంలో లాకీ ఫెర్గూసన్ బరిలోకి దిగుతున్నాడు. మా జట్టులో ప్రతీ ఒక్కరికి ఒక లక్ష్యం ఉంది. ఆ తుది లక్ష్యం మాకు తెలుసు.
కాబట్టి తొలి మ్యాచ్ నుంచి మేం అనుసరిస్తున్న ప్రమాణాలు, విలువలను పాటిస్తూ ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలనేదే మా ఆలోచన. ఇప్పటివరకు అంతా అద్భుతంగా సాగింది. ఈ నిలకడను కాపాడుకుంటూ.. ఇదే జోరును కొనసాగించాలి. తల్లిని కోల్పోయిన అజ్మతుల్లా ఒమర్జాయ్‌కు జట్టు తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. కష్ట సుఖాల్లో మేం అతనికి అండగా ఉంటాం'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
ప్రశాంతంగా ఉంటే గెలుపు మాదే..
మరోవైపు టాస్ గెలిచిన రియాన్ పరాగ్ పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే బౌలింగ్ ఎంచుకున్నట్లు చెప్పాడు. 'మైదానం మేఘావృతమై ఉంది. చిన్నపాటి జల్లులు కూడా కురిశాయి. కాబట్టి ప్రారంభంలో తేమ ఉండే అవకాశం ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకుని త్వరగా కొన్ని వికెట్లు తీసి, ఛేజింగ్ చేయాలని ఆశిస్తున్నాం. ఈ మ్యాచ్‌లో రెండు మార్పులు ఉన్నాయి. హెట్‌మేయర్, రవి బిష్ణోయ్ స్థానాల్లో యశ్ పుంజా, డసన్ షనక బరిలోకి దిగుతున్నారు.
క్లిష్ట సమయాల్లో ప్రశాంతంగా ఉండటం ముఖ్యం. ఒత్తిడితో కూడిన పరిస్థితులు మన వ్యక్తిత్వాన్ని పరీక్షిస్తాయి. ఇలాంటి సందర్బఆల్లో ఎవరైతే ప్రశాంతంగా ఉంటారో వారే విజయం సాధిస్తారు.'అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
పంజాబ్ కింగ్స్ : ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంశ్ ఆర్య, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), కూపర్ కానోలీ, సూర్యాన్ష్ షెడ్జ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
రాజస్థాన్ రాయల్స్ : వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, దాసున్ షనక, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

