Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs RR: పంజాబ్ కొంపముంచిన హెట్‌మైర్.. రాజస్థాన్ సంచలన విజయం!

ఐపీఎల్ 2024 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్‌తో శనివారం జరిగిన లోస్కోరింగ్ థ్రిల్లర్‌లో సమష్టిగా రాణించిన రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో షిమ్రాన్ హెట్‌మైర్(10 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 27 నాటౌట్) సంచలన బ్యాటింగ్‌తో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులే చేసింది. జితేశ్ శర్మ(24 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 29), అషుతోష్ శర్మ(16 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్ తలో వికెట్ తీసారు.

Shimron Hetmyer takes Rajasthan

అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసి గెలుపొందింది. యశస్వి జైస్వాల్(28 బంతుల్లో 4 ఫోర్లతో 39), షిమ్రాన్ హెట్‌మైర్(10 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 27 నాటౌట్) రాణించారు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబడా(2/18), సామ్ కరణ్ రెండేసి వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, లియామ్ లివింగ్ స్టోన్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు.

శుభారంభం..
148 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న వికెట్‌పై ఆచితూచి ఆడిన ఈ జోడీ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతున్న ఈ జోడీని లియామ్ లివింగ్‌స్టోన్ విడదీసాడు. తనూష్ కొటియాన్(24)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 56 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ఆ కాసేపటికే హాఫ్ సెంచరీ దిశగా సాగిన యశస్వి జైస్వాల్‌(39)ను కగిసో రబడా ఔట్ చేశాడు. ఓ భారీ సిక్సర్‌తో దూకుడు కనబర్చిన కెప్టెన్ సంజూ శాంసన్‌ను అతనే వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. రియాన్ పరాగ్(23) పోరాడే ప్రయత్నం చేయగా.. అర్ష్‌దీప్ సింగ్ ఔట్ చేశాడు. ధ్రువ్ జురెల్‌ను హర్షల్ పటేల్ ఔట్ చేయడంతో రాజస్ఠాన్ రాయల్స్‌ ఇబ్బందుల్లో పడింది.

'హిట్‌'మైర్..
ఆ జట్టు విజయానికి 12 బంతుల్లో 20 పరుగులు అవసరమవ్వగా.. సామ్ కరణ్ వేసిన 19వ ఓవర్‌లో పోవెల్ వరుసగా రెండు బౌండరీలు బాది మూడో బంతికి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన కేశవ్ మహరాజ్ రాగా.. చివరి బంతికి వెనుదిరిగాడు. దాంతో ఆఖరి ఓవర్‌లో 10 పరుగులు అవసరమవ్వగా.. హెట్‌మైర్ రెండు భారీ సిక్స్‌లు బాది విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Saturday, April 13, 2024, 23:23 [IST]
Other articles published on Apr 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+