PBKS vs RR : ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. టార్గెట్ విషయంలో ప్రత్యర్థిని ఎంత మేరకు కట్టడి చేయాలనేదానిపై మేం ఎలాంటి లక్ష్యం పెట్టుకోలేదు. మా విధానంపై మాత్రమే ఫోకస్ పెట్టాం. మంచి జట్టును తయారు చేసే పనిలో ఉన్నాం.

ఇప్పటి వరకు మాకు అంతా మంచే జరిగింది. ఈ మ్యాచ్‌కు మా జట్టులో చాలా మంది ఆటగాళ్లు దూరమయ్యారు. అశ్విన్ ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. దాంతో రోవ్‌మన్, కొటియాన్ జట్టులోకి వచ్చారు.'అని అశ్విన్ తెలిపాడు.
మరోవైపు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఫిట్‌నెస్ సమస్యలతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో సామ్ కరణ్ జట్టు సారథ్య బాధ్యతలను చేపట్టాడు. 'శిఖర్ ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. అందుకే నేను వచ్చాను. మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. కానీ భారీ లక్ష్యాన్ని నమోదు చేసి విజయం కోసం పోరాడుతాం.
ధావన్ దూరమైనా టీమ్ కాంబినేషన్ సమతూకంగానే ఉంది. గత కొన్ని మ్యాచ్‌ల్లో మేం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాం. కానీ మా మిడిలార్డర్ చాలా బలంగా ఉంది. ముఖ్యంగా శశాంక్ సింగ్, అషుతోష్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. మా జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. శిఖర్ ధావన్ స్థానంలో అథర్వ టైడ్ వచ్చాడు. గత రెండు మ్యాచ్‌లకు దూరమైన లివింగ్ స్టోన్ కూడా రీఎంట్రీ ఇచ్చాడు.'అని సామ్ కరణ్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్‌మైర్, రోవ్‌మన్ పోవెల్, తనూష్ కొటియన్, కేశవ్ మహరాజ్, ట్రెంట్ బౌల్ట్, ఆవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్
పంజాబ్ కింగ్స్: జానీ బెయిర్ స్టో, అథర్వ టైడ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కరణ్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబడా