PBKS vs RR: యశస్వీ, హిట్‌మైర్ విధ్వంసం.. పంజాబ్‌కు తప్పని పరాజయం!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా రెండు పరాజయాల తర్వాత రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్నందుకుంది. పంజాబ్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సూపర్ బ్యాటింగ్‌తో రాణించి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. పంజాబ్ మాత్రం మిగిలిన మూడు మ్యాచ్‌లకు మూడింటిన మెరుగైన రన్‌రేట్‌తో గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 189 పరుగులు చేసింది.
జానీ బెయిర్ స్టో(40 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో) హాఫ్ సెంచరీతో రాణించగా.. జితేశ్ శర్మ(18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. లివింగ్ స్టోన్(22), భానుక రాజపక్స(27) కూడా విలువైన పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 3 వికెట్లు తీయగా.. అశ్విన్, ప్రసిధ్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు.

షిమ్రాన్ హిట్ మైర్..
అనంతరం రాజస్థాన్ రాయల్స్ 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 190 పరుగులతో సునాయస విజయాన్నందుకుంది. యువ ఓపెనర్ జోస్ బట్లర్(41 బంతుల్లో 9 ఫోర్లు 2 సిక్స్‌లతో 68) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. షిమ్రన్ హెట్‌మైర్(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 నాటౌట్) తనదైన శైలిలో మ్యాచ్‌ను ముగించాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీయగా.. రబడా, రిషి ధావన్ తలో వికెట్ పడగొట్టారు.

చెలరేగిన జోస్ బట్లర్..
190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు జోస్ బట్లర్(16 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 30), యశస్వి జైస్వాల్ శుభారంభం అందించారు. ధాటిగా ఆడుతున్న ఈ జోడీని రబడా విడదీసాడు. ప్రమాదకరంగా మారుతున్న జోస్ బట్లర్‌ను అద్భుత బంతితో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 46 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్(12 బంతుల్లో 4 ఫోర్లతో 23) ధాటిగా ఆడటంతో రాజస్థాన్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది.

యశస్వీ హాఫ్ సెంచరీ..
రిషి ధావన్ బౌలింగ్‌లో సంజూ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగ్గా.. పడిక్కల్‌తో కలిసి యశస్వీ జైస్వాల్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. 8 మ్యాచ్‌ల తర్వాత వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. రాహుల్ చాహర్ బౌలింగ్‌లో క్విక్ డబుల్ తీసిన జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత ధాటిగా ఆడిన అతను వేగంగా పరుగులు చేశాడు. ఇక అతని జోరుకు అర్షదీప్ సింగ్ బ్రేకులు వేసాడు. సూపర్ బాల్‌తో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన దేవదత్ పడిక్కల్ నిదానంగా ఆడగా షిమ్రన్ హెట్‌మైర్ తనదైన శైలిలో చెలరేగాడు. అర్షదీప్ వేసిన 19వ ఓవర్‌లో పడిక్కల్ ఔటైనా.. రియాన్ పరాగ్‌తో కలిసి హెట్‌మైర్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications