Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs RR: పంజాబ్ కింగ్స్‌దే బ్యాటింగ్.. కీలక మార్పుతో రాజస్థాన్ రాయల్స్

PBKS vs RR: Mayank Agarwal wins toss, Punjab Kings to bat

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోందనే ఈ నిర్ణయం తీసుకున్నానని పంజాబ్ సారథి మయాంక్ అగర్వాల్ తెలిపాడు. అంతేకాకుండా మ్యాచ్ సాగుతున్న కొద్ది బ్యాటింగ్‌కు కష్టంగా మారే అవకాశం ఉందన్నాడు. పరిస్థితులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని, సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు అనుకూలించవచ్చని తెలిపాడు.

గత మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ దుమ్మురేపాడు. అతనిలాంటి ఆటగాడు ఉన్నందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నామని మయాంక్ తెలిపాడు. ఇక తాము ఇటీవల వరుసగా టాస్ ఓడిపోతున్నామని తెలిపిన రాజస్థాన్ సారథి సంజూ శాంసన్.. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేయాలని భావించామన్నాడు. తమ జట్టు సమతూకంగా ఉందని, ఇదో భిన్నమైన చాలెంజ్ అని చెప్పాడు. డే గేమ్‌లో స్పిన్నర్లకు సహకారం ఉంటుందని చెప్పాడు. జట్టులో ఒక మార్పు చేశామని చెప్పిన సంజూ.. కరుణ్ నాయర్ స్థానంలో యశస్వి జైస్వాల్ జట్టులోకి వచ్చాడని చెప్పాడు.

ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలందుకున్న పంజాబ్.. 10 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో బలమైన గుజరాత్ టైటాన్స్‌ను మట్టి కరిపించి మంచి జోష్‌లో ఉంది. అదే ఉత్సాహన్ని కొనసాగించి ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలని భావిస్తోంది. మరోవైపు 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలందుకున్న రాజస్థాన్ రాయల్స్.. గత మ్యాచ్‌లో ముంబై చేతిలో ఖంగుతిన్నది. దాంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి విజయాల బాట పట్టాలనుకుంటుంది.

తుది జట్లు:

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్(కీపర్), దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్‌మైర్, రవించంద్రన్ అశ్విన్, ట్రెంబ్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్

పంజాబ్ కింగ్స్: జానీ బెయిర్ స్టో, శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, భానుక రాజపక్స, లియామ్ లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ, రిషి ధావన్, కగిసో రబడా, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్, సందీప్ శర్మ

Story first published: Saturday, May 7, 2022, 15:40 [IST]
Other articles published on May 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+