Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs RR: చెలరేగిన బెయిర్ స్టో, జితేశ్ శర్మ.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం!

 PBKS vs RR: Livingstone, Jitesh help Punjab Kings post 189/5 in 20 overs

ముంబై: జానీ బెయిర్ స్టో(40 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో) హాఫ్ సెంచరీకి జితేశ్ శర్మ(18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్) మెరుపులు తోడవ్వడంతో రాజస్థాన్ రాయల్స్ ముందు పంజాబ్ కింగ్స్ 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ ఇద్దరి సూపర్ బ్యాటింగ్‌తో పాటు లివింగ్ స్టోన్(22), భానుక రాజపక్స(27) విలువైన పరుగులు చేయడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 189 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 3 వికెట్లు తీయగా.. అశ్విన్, ప్రసిధ్ కృష్ణ తలో వికెట్ పడగొట్టారు.

చెలరేగిన బెయిర్ స్టో..

చెలరేగిన బెయిర్ స్టో..

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు జానీ బెయిర్ స్టో, శిఖర్ ధావన్ శుభారంభం అందించారు. ధావన్ నిదానంగా ఆడిన బెయిర్ స్టో ధాటిగా ఆడుతూ వేగంగా పరుగులు రాబట్టాడు. ఈ జోడీని విడదీసేందుకు సంజూ శాంసన్.. అశ్విన్‌ను రంగంలోకి దించాడు. ఇక తమ కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అశ్విన్ 6వ ఓవర్ తొలి బంతికే రాజస్థాన్‌కు మంచి బ్రేక్ త్రూ అందించాడు. అతను వేసిన మొదటి బంతిని ధావన్ ఓవర్ మిడాన్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే ఆ దిశలో సర్కిల్‌పై ఫీల్డింగ్ చేస్తున్న జోస్ బట్లర్ అద్భుతంగా గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు.

జోస్ బట్లర్ స్టన్నింగ్ క్యాచ్

జోస్ బట్లర్ స్టన్నింగ్ క్యాచ్

బట్లర్ అసాధారణ క్యాచ్‌తో శిఖర్ ధావన్(16 బంతుల్లో 2 ఫోర్లతో 12) నిరాశగా పెవిలియన్ చేరాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 47 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి రాజపక్స రాగా.. వికెట్ నష్టానికి 48 పరుగులు చేసి పంజాబ్ పవర్ ప్లేను ముగించింది. ఆ తర్వాత రాజపక్స, బెయిర్ స్టో ధాటిగా ఆడారు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రాజపక్స(18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27) చాహల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

క్రీజులోకి మయాంక్ రాగా.. కుల్దీప్ సేన్ వేసిన 13వ ఓవర్‌లో క్విక్ సింగిల్‌తో బెయిర్ స్టో 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు

 చెలరేగిన జితేశ్ శర్మ..

చెలరేగిన జితేశ్ శర్మ..

ఈ సీజన్‌లో అతనికి ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఇక మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగినా మయాంక్ అగర్వాల్(15)కు కలిసిరావడం లేదు. చాహల్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగి మరోసారి నిరాశపరిచాడు. అదే ఓవర్‌లో బెయిర్ స్టోను వికెట్ల ముందు చాహల్ బోల్తా కొట్టించాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. క్రీజులోకి వచ్చిన లియామ్ లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డారు. అయితే 19వ ఓవర్‌లో లివింగ్ స్టోన్‌ను ప్రసిధ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కుల్దీప్ సేన్ వేసిన ఆఖరి ఓవర్‌లో జితేశ్ శర్మ 6,4, 4, 1 కొట్డంతో పంజాబ్ 185 పరుగులు చేయగలిగింది.

Story first published: Saturday, May 7, 2022, 17:41 [IST]
Other articles published on May 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+